Maharashtra Crisis: మాకు 50 మంది ఎమ్మెల్యేల మద్ధతు ఉంది... Eknath Shinde వెల్లడి

ABN , First Publish Date - 2022-06-24T16:35:18+05:30 IST

ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటుతో మహారాష్ట్రలో రాజకీయ గందరగోళం కొనసాగుతోంది....

Maharashtra Crisis: మాకు 50 మంది ఎమ్మెల్యేల మద్ధతు ఉంది... Eknath Shinde వెల్లడి

ముంబయి,గౌహతి: ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటుతో మహారాష్ట్రలో రాజకీయ గందరగోళం కొనసాగుతోంది. ఫిరాయింపుల నిరోధక చట్టం బారిన పడకుండా అసెంబ్లీలో శివసేన పార్టీని చీల్చేందుకు అవసరమైన 37 మంది ఎమ్మెల్యేల మద్ధతు రెబల్ నాయకుడు ఏక్‌నాథ్ షిండే చేరుకున్నారని తాజా రాజకీయ పరిణామాలు సూచిస్తున్నాయి.శివసేనకు చెందిన 40 మందితో సహా 50 మందికి పైగా ఎమ్మెల్యేలు తనకు మద్దతు ఇస్తున్నారని ఏక్‌నాథ్ షిండే పేర్కొన్నారు. మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్‌లతో శివసేన పొత్తు అసహజమైనదని, బీజేపీతో శివసేన పొత్తును పునరుద్ధరించుకోవాలని షిండే గతంలో నొక్కి చెప్పారు.మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేసిన మంత్రి ఏక్‌నాథ్ షిండే రెబెల్ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ పాలిత అసోం రాష్ట్రంలోని గౌహతిలో క్యాంప్ చేశారు.


Updated Date - 2022-06-24T16:35:18+05:30 IST