Maharashtra Political Crisis: ‘మహా’ సంక్షోభంలో కీలక పరిణామం.. బలపరీక్షపై సుప్రీం తీర్పు ఇదే..

ABN , First Publish Date - 2022-06-30T02:47:50+05:30 IST

బలపరీక్షపై (Floor Test) గవర్నర్ ఆదేశాలను సవాల్ చేస్తూ శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో..

Maharashtra Political Crisis: ‘మహా’ సంక్షోభంలో కీలక పరిణామం.. బలపరీక్షపై సుప్రీం తీర్పు ఇదే..

ముంబై: బలపరీక్షపై (Floor Test) గవర్నర్ ఆదేశాలను సవాల్ చేస్తూ శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో (Supreme Court) వాదనలు ముగిశాయి. బల పరీక్షకు సుప్రీం కోర్టు అనుమతించింది. గవర్నర్ నిర్ణయాన్ని సుప్రీం కోర్టు బలపరిచింది. రేపు ఉదయం 11 గంటలకు మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్షను ఉద్ధవ్‌ ఠాక్రే సర్కార్ ఎదుర్కోనుంది. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం దృష్ట్యా ముంబైలో హై అలర్ట్ ప్రకటించారు. మహారాష్ట్ర అసెంబ్లీ పరిసరాల్లో భారీగా భద్రతను పెంచారు. బల నిరూపణ చేసుకోవాలంటూ గవర్నర్ రాసిన లేఖ బీజేపీకి (BJP) అనుకూలంగా ఉందని శివసేన (Shivsena) ఆరోపించింది. అయితే.. మహారాష్ట్ర సర్కార్ (Maharashtra Government) మైనార్టీలో పడిందని తెలిసినా స్పీకర్ అనర్హత నోటీసులు ఎలా ఇస్తారని సుప్రీంకోర్టు శివసేన తరపు న్యాయవాదిని ప్రశ్నించింది.



స్వతంత్ర ఎమ్మెల్యేల లేఖ దృష్ట్యా బలపరీక్షకు గవర్నర్ నిర్ణయం తీసుకున్నారని షిండే (Eknath Shinde) తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. గవర్నర్ రాజ్యాంగ బాధ్యతలు నిర్వహించకూడదా అని షిండే తరపు న్యాయవాది ఎన్‌కే కౌల్ (NK Kaul) ప్రశ్నించారు. ఇదిలా ఉండగా మహారాష్ట్ర సంక్షోభానికి (Maharashtra Political Crisis) సంబంధించి తాజా రాజకీయ పరిణామాలను గమనిస్తే ఇప్పటిదాకా నడిచిన ఈ హైడ్రామా క్లైమాక్స్ దశకు చేరుకున్నట్టే అనిపిస్తోంది.

Updated Date - 2022-06-30T02:47:50+05:30 IST