మహారాష్ట్ర: తీరాన్ని తాకిన ‘నిసర్గ’ తుఫాను

ABN , First Publish Date - 2020-06-03T19:11:43+05:30 IST

మహారాష్ట్ర: తీరాన్ని తాకిన ‘నిసర్గ’ తుఫాను

మహారాష్ట్ర: తీరాన్ని తాకిన ‘నిసర్గ’ తుఫాను

ముంబై: రాయగడ్‌ జిల్లాలోని అలీబాగ్‌ వద్ద ‘నిసర్గ’ తుపాను తీరాన్ని తాకింది. దీని ప్రభావంతో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నారు. తుపాను తీరం దాటడానికి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. పలు గ్రామాల ప్రజలను  ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఖాళీ చేయిస్తున్నాయి. రాయ్‌గఢ్‌ జిల్లాలో 13 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుపాను దృష్ట్యా కొన్ని రైళ్లు రద్దు చేయగా, మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు. ముంబైలో ఇప్పటికే 144 సెక్షన్‌ అమలులోకి తీసుకువచ్చారు. ముంబైలో రెండు రోజుల పాటు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచనలు జారీ చేశారు. ఇప్పటికే కురుస్తున్న వర్షాలకు పుణెలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 



Updated Date - 2020-06-03T19:11:43+05:30 IST