మహారాష్ట్ర మంత్రి వర్షా గైక్వాడ్‌కు Covid Positive

ABN , First Publish Date - 2021-12-28T17:49:59+05:30 IST

మహారాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి వర్షా గైక్వాడ్‌కు మంగళవారం కొవిడ్ సోకింది....

మహారాష్ట్ర మంత్రి వర్షా గైక్వాడ్‌కు Covid Positive

ముంబై : మహారాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి వర్షా గైక్వాడ్‌కు మంగళవారం కొవిడ్ సోకింది.తాజాగా కరోనా బారిన పడిన మంత్రి వర్షా గైక్వాడ్ ప్రస్థుతం జరుగుతున్న మహారాష్ట్ర శాసనసభా సమావేశాల్లో పాల్గొన్నారు. సోమవారం రాష్ట్ర శాసనమండలిలో పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన పలు ప్రశ్నలకు మంత్రి వర్షా గైక్వాడ్ సమాధానమిచ్చారు. మంత్రి వర్షా గైక్వాడ్ గత సంవత్సరం కూడా కరోనా వైరల్ ఇన్ఫెక్షన్ బారిన పడ్డారు. సోమవారం సాయంత్రం మంత్రికి కొవిడ్ లక్షణాలు కనిపించడంతో ఆవిడకు పరీక్షలు చేయగా కొవిడ్ పాజిటివ్ అని తేలింది. ‘‘నాకు తేలికపాటి కరోనా లక్షణాలు కనిపించాయి. నేను బాగానే ఉన్నాను, నేను ఐసోలేషన్‌లో ఉన్నాను. గత కొన్ని రోజులుగా నన్ను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవడంతోపాటు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను’’ అని వర్షా గైక్వాడ్ చెప్పారు.కరోనా బారిన పడిన మంత్రి వర్షా ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో పర్యటించారు.  


Updated Date - 2021-12-28T17:49:59+05:30 IST