మీ ఇష్టం.. అలా ఉంటేనే లాక్‌డౌన్ ఎత్తివేస్తాం: ‘మహా’ ప్రభుత్వం హెచ్చరిక

ABN , First Publish Date - 2020-04-04T21:53:55+05:30 IST

ఈ నెల 14తో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ గడువు ముగిసినా ముంబైలో మాత్రం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైరస్

మీ ఇష్టం.. అలా ఉంటేనే లాక్‌డౌన్ ఎత్తివేస్తాం: ‘మహా’ ప్రభుత్వం హెచ్చరిక

ముంబై: ఈ నెల 14తో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ గడువు ముగిసినా ముంబైలో మాత్రం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైరస్ నివారణ కోసం ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను ప్రజలు పాటించకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించినా, కరోనా కేసులు పెరిగినా లాక్‌డౌన్ పొడిగిస్తామని ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్ తోపే పేర్కొన్నారు. ప్రజలందరూ తప్పకుండా క్రమశిక్షణ పాటించాలని కోరారు. అలా చేస్తే కరోనా కేసుల సంఖ్య తగ్గుతుందన్నారు. అలాగైతేనే లాక్‌డౌన్ ఎత్తివేసే వీలు ఉంటుందన్నారు. లాక్‌డౌన్‌ గడువు పూర్తయిన తర్వాత రాష్ట్రంలో దశలవారీగా ఎత్తివేస్తామని, అయితే ఆంక్షలు మాత్రం కొనసాగుతాయని అన్నారు. ప్రజలందరూ ఒకేసారి వీధుల్లోకి రావడానికి అనుమతించబోమన్నారు.


 ‘‘ప్రజలందరూ క్రమశిక్షణ పాటించాల్సిందే. అలా చేయకుండా అవసరం లేకున్నా రోడ్లపైకి వస్తే, కేసుల సంఖ్య పెరిగితే లాక్‌డౌన్ కొనసాగించడం మినహా మరో ప్రత్యామ్నాయం ఉండదు’’ అని తోపే స్పష్టం చేశారు. అందుకనే ప్రజలందరూ తప్పకుండా క్రమశిక్షణ పాటించాలని, అలా చేస్తే కరోనా రోగుల సంఖ్య తగ్గుముఖం పడుతుందని, అప్పుడు లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తామని పేర్కొన్నారు. కాగా, రాష్ట్రంలో శనివారం కొత్తగా మరో 47 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 537కు పెరిగింది. 26 మంది కరోనాతో మరణించారు. 



Updated Date - 2020-04-04T21:53:55+05:30 IST