menstruating: పిరియడ్స్‌లో ఉన్న అమ్మాయిలు మొక్కలు నాటొద్దు..అవి కాలిపోతాయి...ఓ టీచర్ ఆదేశం

ABN , First Publish Date - 2022-07-28T14:18:51+05:30 IST

రుతుక్రమంలో ఉన్న పాఠశాల అమ్మాయిలకు(menstruating students) సాక్షాత్తూ తరగతి ఉపాధ్యాయుడు(male teacher) ఆంక్షలు విధించిన...

menstruating: పిరియడ్స్‌లో ఉన్న అమ్మాయిలు మొక్కలు నాటొద్దు..అవి కాలిపోతాయి...ఓ టీచర్ ఆదేశం

నాసిక్ (మహారాష్ట్ర): రుతుక్రమంలో ఉన్న పాఠశాల అమ్మాయిలకు(menstruating students) సాక్షాత్తూ తరగతి ఉపాధ్యాయుడు(male teacher) ఆంక్షలు విధించిన ఉదంతం మహారాష్ట్రలోని(Maharashtra) ఓ ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో వెలుగుచూసింది.రుతుక్రమంలో ఉన్న పాఠశాల బాలికలు(menstruating girls) మొక్కలు నాటకుండా(planting trees) ఆపేసిన ఘటన నాసిక్‌లోని ఒక ఆశ్రమ పాఠశాలలో జరిగింది.తన పాఠశాల ఆవరణలో రుతుక్రమంలో ఉన్న బాలికలు (girls) మొక్కలు నాటే కార్యక్రమంలో(tree plantation drive) పాల్గొనకుండా నిలిపివేశారని ఓ పాఠశాల బాలిక ఫిర్యాదు చేసింది.మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న బోర్డింగ్ స్కూలులో రుతుక్రమంలో ఉన్న తమను మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనకుండా ఒక మగ ఉపాధ్యాయుడు అడ్డుకున్నాడని బాలిక ఆరోపించింది. 


పాఠశాల బాలికల ఫిర్యాదు మేర మహారాష్ట్ర గిరిజనాభివృద్ధి శాఖ అధికారులు విచారణకు ఆదేశించారు.పిరియడ్స్ ఉన్న అమ్మాయిలు మొక్కలు నాటితే చెట్లు పెరగవని, అవి కాలిపోతాయని టీచర్ తనతో పాటు ఇతరులకు చెప్పారని సైన్స్ ఫ్యాకల్టీకి చెందిన 12వ తరగతి విద్యార్థిని పేర్కొంది.16వ అంతర్జాతీయ చెట్ల పెంపకం దినోత్సవం సందర్భంగా విద్యార్థులు మొక్కలు నాటే కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది.


ఈ ఘటనపై దర్యాప్తు చేస్తామని గిరిజనాభివృద్ధిశాఖ అదనపు కమిషనర్ సందీప్ గోలాయిట్ తెలిపారు.పాఠశాలలో 500 మంది బాలికలు ఉన్నారు.ఫిర్యాదు చేసిన బాలిక శ్రమజీవి సంఘటన నాసిక్ జిల్లా కార్యదర్శి భగవాన్ మాధేని కూడా సంప్రదించి ఈ వ్యవహారంపై వివరించింది.పాఠశాల ప్రవేశానికి ముందు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ (UGP)ని కూడా తప్పనిసరి చేశారని మాధే ఆరోపించింది. 




Updated Date - 2022-07-28T14:18:51+05:30 IST