Maharashtra అసెంబ్లీలో బలపరీక్ష రేపు

ABN , First Publish Date - 2022-06-29T14:39:11+05:30 IST

శివసేన పార్టీలో ఏక్ నాథ్ షిండే నేతృత్వంలో ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన నేపథ్యంలో రేపు మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష జరగనుంది....

Maharashtra అసెంబ్లీలో బలపరీక్ష రేపు

అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోండి...ఉద్ధవ్ ఠాక్రేకు గవర్నర్ ఆదేశాలు

ముంబయి: శివసేన పార్టీలో ఏక్ నాథ్ షిండే నేతృత్వంలో ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన నేపథ్యంలో గురువారం (రేపు) మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష జరగనుంది. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను మెజారిటీ నిరూపించుకోవాలని కోరారు.గురువారం (రేపు) సాయంత్రం 5 గంటలకు సభలో మెజారిటీ నిరూపించుకోవాలని ఉద్ధవ్ ఠాక్రేను మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ కోరారు.ఈ అసెంబ్లీ సమావేశాన్ని వీడియోలో రికార్డ్ చేయాలని గవర్నర్ ఆదేశించారు.గురువారం ఉదయం 11 గంటలకు సమావేశమయ్యే ఏకైక అజెండా ఫ్లోర్ టెస్ట్ అని గవర్నర్ పేర్కొన్నారు.



 ‘‘రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత రాజకీయ దృశ్యం చాలా కలవరపెడుతోంది. 39 మంది ఎమ్మెల్యేలు మహారాష్ట్ర వికాస్ అఘాడి ప్రభుత్వం నుంచి వైదొలగాలని ఆకాంక్షించారు. ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా తమ మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు ఈమెయిల్ ద్వారా లేఖ పంపారు. ప్రతిపక్ష నాయకుడు కూడా కలుసుకున్నారు... ప్రస్తుతం ఉన్న పరిస్థితిని నాకు వివరించి, ఫ్లోర్ టెస్ట్ కోసం అడిగారు’’ అని గవర్నర్ కోష్యారి వివరించారు.

Updated Date - 2022-06-29T14:39:11+05:30 IST