Maharashtra new govt సంచలన నిర్ణయం

ABN , First Publish Date - 2022-07-01T12:40:35+05:30 IST

మహారాష్ట్రలో శివసేన తిరుగుబాటు నాయకుడు ఏక్‌నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఏర్పడిన కొత్త ప్రభుత్వం రెండో రోజే సంచలన నిర్ణయం...

Maharashtra new govt సంచలన నిర్ణయం

ఆరే కాలనీలోనే metro car shed

ముంబయి(మహారాష్ట్ర): మహారాష్ట్రలో శివసేన తిరుగుబాటు నాయకుడు ఏక్‌నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఏర్పడిన కొత్త ప్రభుత్వం రెండో రోజే సంచలన నిర్ణయం తీసుకుంది.మహారాష్ట్రలో ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాన్ని షిండే సర్కారు వెనక్కి తీసుకుంది. ముంబయి మెట్రోకారు షెడ్డు నిర్మాణం ఆరేకాలనీలో నిర్మించాలని షిండే ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఉద్ధవ్ సర్కారు నిర్ణయాన్ని తిప్పికొట్టింది. మెట్రో కార్ షెడ్‌ను ప్రభుత్వం ఇప్పుడు ఆరే కాలనీకి మారుస్తుందని బొంబాయి హైకోర్టుకు తెలియజేయాలని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ప్రభుత్వ న్యాయ బృందాన్ని కోరారు.ఉద్ధవ్ ప్రభుత్వం మెట్రో కార్ షెడ్‌ను ఆరేకాలనీ నుంచి కంజుర్‌మార్గ్‌కు మార్చాలని గతంలో ఆదేశించింది.ఉద్ధవ్ ప్రభుత్వ నిర్ణయానికి భిన్నంగా షిండే, ఫడణవీస్ నేతృత్వంలోని మహారాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకోవడం ముంబయి నగరంలో చర్చనీయాంశంగా మారింది.   


Updated Date - 2022-07-01T12:40:35+05:30 IST