Abn logo
Sep 21 2020 @ 06:51AM

బీవండీలో కుప్పకూలిన భవనం..10 మంది మృతి

Kaakateeya

శిథిలాల కింద చిక్కుకున్న ఫ్లాట్ల నివాసులు

బీవండీ (మహారాష్ట్ర): తెల్లవారుజామున ఫ్లాట్ల నివాసులు గాఢనిద్రలో ఉన్న సమయంలో మూడంతస్తుల భవనం సగం ఒక్కసారిగా కుప్పకూలిపోయి 10 మంది మరణించిన ఘటన మహారాష్ట్రలోని బీవండీ నగరంలో జరిగింది. బీవండీ నగరంలోని 21 ఫ్లాట్లు ఉన్న జిలానీ అపార్టుమెంటు సగం ఆదివారం తెల్లవారుజామున 3.40 గంటలకు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటన జరిగిన సమయంలో ఫ్లాట్ల నివాసులు గాఢ నిద్రలో ఉన్నారు. ఈ ఘటనలో 10 మంది మరణించారు. మూడు అంతస్తుల 69వనంబరు జిలానీ అపార్టుమెంటును 1984వ సంవత్సరంలో నిర్మించారు. 

ఈ భవనం కూలిపోవడంతో స్థానికులు, అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చి శిథిలాల కింద చిక్కుకుపోయిన 25 మందిని స్థానికులు రక్షించారు. మరో 20నుంచి 25 మంది భవన శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని ఎన్డీఆర్ఎఫ్ అధికారులు అనుమానిస్తున్నారు. స్థానికులు, అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో బీవండీ నగరంలోని పటేల్ కాంపౌండులో గందరగోళం నెలకొంది. ఎన్డీఆర్ఎఫ్ బృందం హుటాహుటిన వచ్చి సహాయ కార్యక్రమాలు చేపట్టింది. 

Advertisement
Advertisement