‘మహార్‌’ ధ్రువీకరణ పత్రాలు తహసీల్దార్‌లచే జారీ చేయాలి

ABN , First Publish Date - 2021-08-04T05:25:05+05:30 IST

మహార్‌ కులస్తులకు తహసీల్దార్‌లచే కుల ధ్రువీరణ పత్రాలను జారీ చేయాలని మహార్‌ సంఘ నాయకులు డిమాండ్‌ చేశారు. మంగళవారం బేల మండల తహసీల్దార్‌కు మహార్‌ బెటాలియన్‌ ఆధ్వ ర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు.

‘మహార్‌’ ధ్రువీకరణ పత్రాలు తహసీల్దార్‌లచే జారీ చేయాలి
బేల తహసీల్దార్‌కు వినతి పత్రం అందిస్తున్న మహార్‌ కులస్తులు

ఆదిలాబాద్‌, ఆగస్టు3 (ఆంధ్రజ్యోతి): మహార్‌ కులస్తులకు తహసీల్దార్‌లచే కుల ధ్రువీరణ పత్రాలను జారీ చేయాలని మహార్‌ సంఘ నాయకులు డిమాండ్‌ చేశారు. మంగళవారం బేల మండల తహసీల్దార్‌కు మహార్‌ బెటాలియన్‌ ఆధ్వ ర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మహార్‌ బెటలాయిన్‌ నాయకులు మస్కేతేజరావు మాట్లాడుతూ కొన్నేళ్లుగా మహార్‌లు కుల ధ్రువీకరణ పత్రం పొందడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నోటరీ, అఫిడవిట్‌, ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల హామీ తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇలా సకాలంలో విద్యార్థులు నిరుద్యోగులకు కుల ధ్రువీకరణ పత్రాలు అందక నష్టపోయిన పరిస్థితులు ఉన్నాయన్నారు. వెంటనే ఆంక్షలను ఎత్తివేసి ఇతర కులాల మాదిరిగానే మహార్‌లకు కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని కోరారు. ఇందులో మహార్‌ బెటాలియన్‌ నాయకులు గౌతంటాక్రె, దుర్గావాస్‌, గావండే, గజానన్‌, కోబ్రాగార్డె, బిక్కన్‌ మిన్సర్‌కర్‌, సంతోష్‌ మన్కర్‌, గణేష్‌ కాంబ్లె, దీపక్‌ కాంబ్లె అమూల్‌, సిద్ధార్త్‌ తదితరులు పాల్గొన్నారు.

గుడిహత్నూర్‌: ఎస్సీ మహార్‌ కులస్తులకు స్థానిక తహసీల్దార్‌చే కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని కోరుతూ మహార్‌ బెటాలియన్‌ ఆధ్వర్యంలో మంగళవారం తహసీల్దార్‌ పవన్‌చంద్రకు వినతి పత్రం అందజేశారు. గత కొన్ని సంవత్సరాల నుంచి ఆర్డీవోచే తమకు కుల ధ్రువీకరణ పత్రాలు జారీ అయ్యేవని సకాలంలో కుల పత్రాలు జారీ కాక పోవడంతో ఇబ్బందులు పడాల్సి వచ్చేదన్నారు. ప్రభుత్వం తమ సమస్యను గుర్తించి తహసీల్దార్‌చే జారీ చేయాలని కోరారు.  కార్యక్రమంలో మహార్‌ బెటాలియన్‌ సభ్యులు మస్కేమాదవ్‌, జొందలే అజయ్‌కుమార్‌, ససానేమాదవ్‌, దహేకాంబ్లె ఆనంద్‌, సిద్ధార్త్‌ మెండే, బబన్‌బుద్దే, బాలేరావు జ్ఞానోబా, కొల్హారి మాజీ ఎంపీటీసీ కాంబ్లె జ్యోతి పాల్గొన్నారు.

ఆదిలాబాద్‌టౌన్‌: ఎస్సీ(మహార్‌) కులస్తులమైన తమకు తహసీల్దార్‌ ద్వారానే షెడ్యూల్డ్‌ కులం మహార్‌ కుల ధ్రువీకరణ పత్రం జారీ చేయాలని కోరుతూ మహార్‌ బెటాలియన్‌ ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతి పత్రం అందించారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా మంగళవారం మహార్‌ బెటాలియన్‌ ఆధ్వర్యంలో అర్బన్‌ తహసీల్దార్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు.

ఉట్నూర్‌: ఉమ్మడి జిల్లాలోని షెడ్యూల్డ్‌ కులాలకు చెందిన మహార్‌ కులస్తులకు కుల ధ్రువీకరణ పత్రాలు తహసీల్దార్‌ల ద్వారా ఇవ్వాలని మహార్‌ బెటాలియన్‌ జిల్లా అధ్యక్షుడు టిబోటే ముకుంద్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం స్థానిక తహసీల్దార్‌కు మెమోరండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సింగారే భరత్‌, ప్రజ్ఞాశీల్‌ కాంబ్లే, వాగ్మారే భీంరావు, ప్రథమానంద్‌, కాంబ్లే మంచక్‌రావు, నందన్‌వార్‌ యశ్వాల్‌ లు పాల్గొన్నారు. 

ఇంద్రవెల్లి: మహార్‌ కులస్తులకు తహసీల్దార్‌లచే కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని అంబేద్కర్‌ మెమోరియల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సర్కాలే శివాజీ డిమాండ్‌ చేశారు. మంగళారం మహార్‌ బెటాలియన్‌ జిల్లా శాఖ పిలుపు మేర కు డిమాండ్‌తో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్‌ రాఘవేంద్రరావుకు సమర్పించారు. కార్యక్రమంలో కాలే శివాజీ, భవలే సత్యానంద్‌, జీవనే శత్రుగన్‌, గాయక్‌ వాడ్‌ భారత్‌, వాగ్మారే బాబు, ఆచార్య దత్తా పాల్గొన్నారు. 

నార్నూర్‌: కుల ధ్రువీరణ పత్రాలు తహసీల్దార్‌చే జారీ చేయాలని ఎంపీటీసీ పరమేశ్వర్‌ కొలెట్కర్‌ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయం ఆర్‌ఐ రాథోడ్‌ కవితకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహేదర్‌ దుర్గే, కాంతారావు, చంద్రశేఖర్‌, శాంతరావు, కేశవ్‌, రాజేందర్‌, దమ్మపాల్‌, సాయి తదితరులు ఉన్నారు. 

బజార్‌హత్నూర్‌: మహార్‌ కుల ధ్రువీకరణ పత్రాలను తహసీల్దార్‌లచే జారి చేయాలని అంబేడ్కర్‌ సంఘం సభ్యులు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో సంఘం సభ్యులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కానిందె జగదీశ్‌, భౌరె ప్రహ్లాద్‌, శ్రీధర్‌, సంతోష్‌, తదితరలు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-04T05:25:05+05:30 IST