Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 22 2021 @ 08:55AM

recorded on camera: మహంత్ నరేంద్ర‌గిరి మృతదేహానికి పోస్టుమార్టం

ప్రయాగరాజ్ (ఉత్తరప్రదేశ్):మహంత్ నరేంద్రగిరి ఆత్మహత్య కేసు పోస్టుమార్టం అనంతరం అసలు నిజం బయటపడుతుందని భావిస్తున్నారు. మహంత్ నరేంద్రగిరి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రయాగరాజ్ నగరంలోని స్వరూప రాణి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం ఐదుగురు వైద్యుల బృందం నిర్వహిస్తోంది. పోస్టుమార్టం చేసే విధానాన్ని కెమెరాలో రికార్డ్ చేస్తున్నారు. భారతదేశంలోని అతిపెద్ద సాధువుల సంస్థ అయిన  అఖిల భారత అఖాడా పరిషత్ కు అధ్యక్షుడిగా ఉన్న నరేంద్రగిరి అలహాబాద్‌లోని బాఘంబరి మఠంలో సోమవారం ఉరి వేసుకుని చనిపోయారు. ఒక సూసైడ్ నోట్ కూడా దొరికిందని, అందులో ఓ శిష్యుడి వల్ల మానసికంగా కలత చెందాడని ఉందని పోలీసులు చెప్పారు.

మహంత్ నరేంద్రగిరి మరణం తర్వాత హరిద్వార్‌లో ఒక శిష్యుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తునకు ఉత్తర ప్రదేశ్ పోలీసులు మంగళవారం 18 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక పోలీసు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు.నరేంద్రగిరి మరణానికి సంబంధించిన అన్ని కోణాలపై దర్యాప్తు చేస్తున్నామని, దోషులను విడిచిపెట్టబోమని సీఎం యోగిఆదిత్యనాథ్ చెప్పారు. మహంత్ మృతి విషయంపై తమ ప్రభుత్వం అన్ని విధాల విచారణకు సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య చెప్పారు. మహంత్ మరణంపై సీబీఐ విచారణ కోరుతూ అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పిటిషన్ కూడా పంపించారు.


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement