బహుజనుల అభివృద్ధికి బాటలు వేసిన మహనీయుడు

ABN , First Publish Date - 2021-11-29T05:26:02+05:30 IST

బహుజనుల అభివృద్ధికి బాటలు వేసిన గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్‌ తెలిపారు.

బహుజనుల అభివృద్ధికి బాటలు వేసిన మహనీయుడు
చిన్నకోడూరులో జ్యోతిరావు ఫూలే విగ్రహానికి పూలమాల వేస్తున్న దృశ్యం

 పలు మండలాల్లో జ్యోతిరావు ఫూలే వర్ధంతి

చిన్నకోడూరు, నవంబరు 28: బహుజనుల అభివృద్ధికి బాటలు వేసిన గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్‌ తెలిపారు. ఆదివారం చిన్నకోడూరు మండల కేంద్రంలో జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహనికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెనకబడిన కులాల అభ్యున్నతి కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన మహనుభావుడని కొనియాడారు. కార్యక్రమంలో వీడీసీ  చైర్మన్‌ ఆనందం, బాలకృష్ణ, బాబు, మల్లేశం పాల్గొన్నారు.


చేర్యాలలో..

చేర్యాల, నవంబరు 28: మహాత్మా జ్యోతిరావు ఫూలే 131వ వర్ధంతిని ఆదివారం చేర్యాలలో తెలంగాణ మాలమహానాడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక అంబేడ్కర్‌ విగ్రహం వద్ద  మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శి బుట్టి సత్యనారాయణ ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు కమలాపురం కిష్టయ్య, గొప్పె నాగయ్య, శ్రీరాం బాలయ్య, గుస్క రాందాస్‌, పుట్ట యాదయ్య, గుస్క వెంకటేశ్‌, పుట్ట అయిలయ్య, గుస్క జనార్దన్‌, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.


కొండపాకలో..

కొండపాక, నవంబరు 28: కొండపాకలో ఆదివారం అంబేడ్కర్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో ఫూలే వర్ధంతిని  నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అంబేడ్కర్‌ యువజన సంఘం అధ్యక్షుడు పొన్నాల శ్రీనివాస్‌, టీపీసీసీ ఎస్సీ ఎస్టీ సెల్‌ రాష్ట్ర కన్వీనర్‌ కొండపాక విజయ్‌కుమార్‌, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు అంబటి బాలచందర్‌గౌడ్‌, ఎంఈఎఫ్‌ మండల అధ్యక్షుడు రామచంద్రం, డీసీసీ ఉపాధ్యక్షుడు మల్లేశం, కాంగ్రెస్‌ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు బుద్ధి రమేష్‌, బీఎస్పీ మండల కన్వీనర్‌ దర్గయ్య, ఎంఎస్‌ఎఫ్‌ మండల అధ్యక్షుడు బోకె నవీన్‌, నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-29T05:26:02+05:30 IST