మహనీయుల త్యాగాలు వెలకట్టలేనివి

ABN , First Publish Date - 2022-08-11T06:07:25+05:30 IST

దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో మహనీయుల త్యాగాలు వెలకట్టలేనివని డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

మహనీయుల త్యాగాలు వెలకట్టలేనివి
ఆజాదీకా గౌరవ యాత్రలో పాల్గొన్న అనిల్‌కుమార్‌రెడ్డి

వలిగొండ, ఆగస్టు 10: దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో మహనీయుల త్యాగాలు వెలకట్టలేనివని డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. స్వాతంత్య్రం వచ్చి 75సంవత్సరాల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన ఆజాదీకా గౌరవ యాత్ర రెండో రోజు వలిగొండ మండలంలో బుఽధవారం సాగింది. ఈ సందర్భంగా అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలో ఎందరో మహనీయులు తమ ప్రాణాలను ఫనంగా పెట్టారని అన్నారు.  కాంగ్రెస్‌ పార్టీని స్థాపించి ఆ జెండా నీడలోనే పోరాటం సాగించారని తెలిపారు.  గాంధీజీ చేపట్టిన క్విట్‌ ఇండియా ఉద్యమం యావత దేశ ప్రజల్లో స్వాతంత్య్ర స్ఫూర్తిని నింపిందని పేర్కొన్నారు. నాడు దేశంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం జవహర్‌ లాల్‌ నెహ్రూ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రాజెక్ట్‌లను నిర్మించారని తెలిపారు. భూ సంస్కరణలు బ్యాంకుల జాతీయ కరణ ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కాంగ్రెస్‌ పార్టీ హయాంలోనే జరిగాయని అన్నారు. నేడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జీఎస్టీని తీసుకువచ్చి చిన్న వ్యాపారులపైన అదనపు భారాన్ని మోపిందని అన్నారు. 

  యాత్ర సాగిందిలా... 

వలిగొడ పట్టణంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో డీసీసీ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పట్టణ ప్రధాన రహదారిపై భారీ ర్యాలీ చేపట్టారు. మల్లేపల్లి, వెల్వర్తి, అరూరు, వెంకటాపురం, వేములకొండ, ముద్దాపురం, మీదుగా చిత్తా పురం గ్రామాల వరకు యాత్ర సాగింది. అడుగడుగునా ప్రజలు బ్రహ్మరఽతం పట్టారు. ఆజాదీకా యాత్రతో కార్యకర్తల్లో నూతన ఉత్సాహం పెరిగింది. 

 గాంధీ గ్లోబల్‌ ఫ్యామిలీ మద్దతు 

స్వాతంత్య్ర ఉద్యమంలో మహనీయుల పాత్రను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి చేపట్టిన ఆజాదికా గౌరవ యాత్రకు గాంధీ గ్లోబల్‌ ఫ్యామిలీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. రాష్ట్ర వర్కింగ్‌ ప్రసిడెంట్‌ మెరుగు మధు, డీసీసీ అధ్యక్షుడికి సన్మానం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నూతి రమే్‌షరాజు, జడ్పీటీసీ  వాకిటి పద్మ అనంతరెడ్డి, కాంగ్రెస్‌ మండల పార్టీ అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి, పట్టణ అఽధ్యక్షుడు కంకల కిష్టయ్య, వైస్‌ఎంపీపీ బాతరాజు ఉమాబాలనర్సింహ పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-11T06:07:25+05:30 IST