మహానందీశ్వరుడి హుండీ ఆదాయం రూ.33.48 లక్షలు

ABN , First Publish Date - 2022-08-11T05:25:42+05:30 IST

మహానంది క్షేత్రంలో బుధవారం నిర్వహించిన హుండీ లెక్కింపు ద్వారా దేవస్థానానికి రూ. 33.48 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.

మహానందీశ్వరుడి హుండీ ఆదాయం రూ.33.48 లక్షలు

మహానంది, ఆగస్టు 10: మహానంది క్షేత్రంలో బుధవారం నిర్వహించిన హుండీ లెక్కింపు ద్వారా దేవస్థానానికి రూ. 33.48 లక్షల  ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఆలయం ప్రాంగణంలోని అభిషేకమంటపంలో  ప్రధాన ఆలయాల్లోని హుండీలతో పాటు అన్నప్రసాదం, గో సంరక్షణ హుండీల్లో భక్తులు వేసిన కానుకలను లెక్కించారు. ప్రధాన ఆలయాల్లోని హుండీల ద్వారా రూ.32,44,655, అన్నదానం రూ.78,061, గోసంరక్షణ హుండీ ద్వారా రూ. 26,141 ఆదాయం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో గడివేముల గ్రూపు దేవాలయాల ఈవో నాగప్రసాద్‌, ఏఈఓ ఎర్రమల్ల మధుతో పాటు పాలకమండలి సభ్యులు గంగిశెట్టి మల్లికార్జున, వీరభద్రుడు, 90 మంది దత్తసాయి సేవకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-11T05:25:42+05:30 IST