మహానాడు వేదిక వద్ద పేర్లు రిజిస్ర్టేషన్ చేయించుకుంటున్న తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు , పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు
తెలుగుదేశం పార్టీ మహానాడుకు జిల్లా నుంచి పెద్దఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. ఒంగోలులోని వేదిక వద్ద పేర్లను రిజిస్ర్టేషన్ చేయించుకునేందుకు పోటీ పడ్డారు. పార్టీ విశాఖ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, దక్షిణ, భీమిలి నియోజకవర్గ ఇన్చార్జులు గండి బాబ్జీ, కోరాడ రాజబాబు తదితరులు మహానాడుకు హాజరైన వారిలో ఉన్నారు. తెలుగు యువత నేతలు ఉత్సాహంగా రక్తదానం చేశారు.