మహానాడు ఏర్పాట్లని పరిశీలిస్తున్న అచ్చన్నాయుడు, ఇంటూరి నాగేశ్వరరావు, తదితరులు
కందుకూరు, మే 26: ఒంగోలులో మహానాడు ఏర్పాట్లన్నీ శరవేగంగా జరుగుతుండగా, కందుకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఇంటూరి నాగేశ్వరరావు గురువారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చన్నాయుడుతో కలిసి మహానాడు ప్రాంగణాన్ని పరిశీలించారు. మహానాడుకు తరలివచ్చే అతిథులు, కార్యకర్తల కోసం ఏర్పాటుచేసిన భోజనశాలను, వంట కార్యక్రమాన్ని ప్రారంభించటంతోపాటు పార్కింగ్ సదుపాయాలను, ప్రతినిధుల కమిటీ నమోదు సెంటర్లను పరిశీలించారు. అనంతరం జిల్లాలోని ముఖ్య నేతలతో కలిసి బొప్పూడి వద్ద పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలికే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్ర మంలో నూకసాని బాలాజి, ఏలూరి సాంబశివరావుతో పాటు డెయిరీ మాజీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు, పలువురు నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.