జూరాల ప్రాజెక్ట్ 49 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2020-10-16T12:46:45+05:30 IST

ఎగువ నుంచి వస్తున్న నీటితో జూరాల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం అధికంగా ఉంది.

జూరాల ప్రాజెక్ట్ 49 గేట్లు ఎత్తివేత

మహబూబ్‌నగర్: ఎగువ నుంచి వస్తున్న నీటితో జూరాల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం అధికంగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా... ప్రస్తుత నీటిమట్టం 316.340మీటర్లుగా ఉంది. అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలకు గాను... ప్రస్తుత నీటి నిల్వ 5.699టీఎంసీలకు చేరింది. వరద ప్రవాహం అధికంగా ఉండటంతో అధికారులు ప్రాజెక్ట్ 49 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 5,47,000 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 6,03,468క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. 

Updated Date - 2020-10-16T12:46:45+05:30 IST