Mahabubnagar: జూరాల ప్రాజెక్ట్‌ 14 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-08-10T12:50:10+05:30 IST

జూరాల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం పెరుగుతుంది. అధికారులు ప్రాజెక్ట్ 14 గేట్లను ఎత్తి దిగువకు నీటిని శ్రీశైలం వైపునకు 89,580 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

Mahabubnagar: జూరాల ప్రాజెక్ట్‌ 14 గేట్లు ఎత్తివేత

మహబూబ్‌నగర్: జూరాల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం పెరుగుతుంది. అధికారులు ప్రాజెక్ట్ 14 గేట్లను ఎత్తి దిగువకు నీటిని శ్రీశైలం వైపునకు 89,580 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. జూరాల ఇన్ ఫ్లో 92,100 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 93,096 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లుగా ఉండగా, ప్రస్తుతం 317.760 మీటర్లుగా ఉంది. జూరాల పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 8.145 టీఎంసీలుగా ఉంది.

Updated Date - 2021-08-10T12:50:10+05:30 IST