మహబూబ్‌నగర్: జూరాల ప్రాజెక్ట్‌కు వరద పోటెత్తుతుంది. దీంతో ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు జూరాల 47 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. జూరాల ఇన్ ఫ్లో 4,77,000 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 4,76,047 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. జూరాల పూర్తి నీటిమట్టం 318.516 మీటర్లు ఉండగా, ప్రస్తుతం 316.840 మీటర్లుగా ఉంది. జూరాల ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటినిల్వ 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 6.462 టీఎంసీలుగా ఉంది.