జూరాల ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద

ABN , First Publish Date - 2020-07-16T13:44:17+05:30 IST

జూరాల ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద

జూరాల ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద

మహబూబ్‌నగర్: జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి అధికంగా ఉంది. దీంతో అధికారులు ప్రాజెక్టు ఆరు గేట్లు ఎత్తివేసి నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 62,000 క్యూసెక్కులు కాగా... ఔట్ ఫ్లో 63,702 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. అలాగే పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు ఉండగా... ప్రస్తుత నీటి నిల్వ 8.750 టీఎంసీలుగా ఉంది.  ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లకు గాను... ప్రస్తుత నీటి మట్టం 318.070  మీటర్లుగా కొనసాగుతోంది.


మరోవైపు ఎగువ జూరాల జల విద్యుత్ కేంద్రంలో నాలుగు యూనిట్లలో 156  మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుండగా...దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రంలో ఐదు యూనిట్లలో 200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. 

Updated Date - 2020-07-16T13:44:17+05:30 IST