Telangana: అత్తతో అక్రమసంబంధం... నిలదీసిన మామపై అల్లుడి దాడి

ABN , First Publish Date - 2022-02-26T17:37:40+05:30 IST

జిల్లాలోని కేసముద్రం మండలం ఇంటికన్నెలో దారుణం జరిగింది. మామపై అల్లుడు కర్రతో దాడి చేసి హత్య చేశాడు.

Telangana: అత్తతో అక్రమసంబంధం... నిలదీసిన మామపై అల్లుడి దాడి

మహబూబాబాద్: జిల్లాలోని కేసముద్రం మండలం ఇంటికన్నెలో దారుణం జరిగింది. మామపై అల్లుడు కర్రతో దాడి చేసి హత్య చేశాడు. అత్తతో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో అల్లుడిని మామ చెన్నబోయిన వెంకన్న నిలదీశాడు. దీంతో అక్రమబంధానికి అడ్డుగా ఉన్నాడని మామను అల్లుడు యాకయ్య కర్రతో కొట్టి గొంతు నులిమి చంపేశాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-02-26T17:37:40+05:30 IST