Abn logo
Sep 27 2021 @ 10:04AM

బస్సు ప్రయాణంలో పరిచయం.. ప్రేమలో నిండామునిగిన తర్వాత.. ప్రియుడికి షాకింగ్ విషయం తెలిసి..

మహబూబాబాద్‌: ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి వరుసకు అన్న అవుతాడని తెలిసి ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తెలిసిందే. ఈ విషయం మరిచిపోకముందే మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమించిన అమ్మాయి వరుసకు చెల్లెలు అవుతుందని తెలసి ఆత్మహత్య చేసుకున్నాడో యువకుడు. వివారాల్లోకి వెళ్తే.. 


మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలం సంతులాల్‌పోడు తండాకు చెందిన బానోతు వంశీ ఇంటర్ చదువుతున్నాడు. కాలేజ్‌కు వెళ్తున్న సమయంలో బస్సు ప్రయాణంలో ఓ యువతి పరిచయమయ్యింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో 19ఏళ్ల బానోతు వంశీకి ఓ విషయం తెలిసి ఖంగుతిన్నాడు. తాను ప్రేమించిన యువతి వరుసకు చెల్లి అవుతుందని తెలిసింది. అమ్మాయికి కూడా అసలు విషయం తెలియడంతో.. ప్రేమించుకోవడం తప్పని దూరంగా ఉంటోంది. మనస్తాపానికి గురైన వంశీ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption

ఇవి కూడా చదవండిImage Caption

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...