మహబూబాబాద్: యువతి ఆత్మహత్య కేసులో నిందితుల అరెస్టు

ABN , First Publish Date - 2022-02-24T21:52:28+05:30 IST

జిల్లాలో సంచలనం కలిగించిన యువతి గ్యాంగ్ రేప్ కేసులో

మహబూబాబాద్: యువతి ఆత్మహత్య కేసులో నిందితుల అరెస్టు

మహబూబాబాద్: జిల్లాలో సంచలనం కలిగించిన యువతి గ్యాంగ్ రేప్ కేసులో నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. సామూహిక అత్యాచారానికి పాల్పడి, యువతి ఆత్మహత్యకు కారణమైన నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసినట్లు ఎస్పీ శరత్ చంద్ర తెలిపారు. ప్రేమించి పెళ్ళిచేసుకోవాలన్న పాపానికి ముగ్గురు స్నేహితులతో దుండగుడు అత్యాచారం చేయించి వీడియో చిత్రీకరించాడని పోలీసులు తెలిపారు. ఆ అవమానం భరించలేక పురుగుల మందు తాగి ఆ యువతి ఆత్మహత్యాయత్నం చేసిందని ఎస్పీ శరత్ చంద్ర  తెలిపారు. యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న చనిపోయిందన్నారు. యువతి ఆత్మహత్యకు కారణమైన నిందితులను అరెస్టు చేశామని ఆయన తెలిపారు. 


Updated Date - 2022-02-24T21:52:28+05:30 IST