Mahabalipuramలో ముందుకొచ్చిన సముద్రం

ABN , First Publish Date - 2022-05-17T13:10:01+05:30 IST

బంగాళాఖాతంలో సోమవారం వివిధ రకరాల మార్పులు ఏర్పడ్డాయి. చెంగల్పట్టు జిల్లా మహాబలిపురంలో సముద్రుడు ముందుకు రాగా, కన్నియాకుమారిలో వెనక్కి

Mahabalipuramలో ముందుకొచ్చిన సముద్రం

                - కుమరిలో వెనక్కి మళ్లిన నీరు


పెరంబూర్‌(చెన్నై): బంగాళాఖాతంలో సోమవారం వివిధ రకరాల మార్పులు ఏర్పడ్డాయి. చెంగల్పట్టు జిల్లా మహాబలిపురంలో సముద్రుడు ముందుకు రాగా, కన్నియాకుమారిలో వెనక్కి మళ్లడం స్థానికులను ఆందోళనకు గురి చేసింది. మహాబలిపురం ప్రాంతంలో రెండ్రోజులుగా అలల ఉదృతి అధికంగా ఉంది. దీంతో సముద్రపు ఆలయ పరిసరాల్లో నీరు చేరింది. దీని గురించి స్థానికులు మాట్లాడుతూ, జనవరి, జూన్‌ నెలల్లో దక్షిణం నుంచి ఉత్తరానికి, జూలై, డిసెంబరులో ఉత్తరం నుంచి దక్షిణానికి సముద్రాలు గాలులు వీస్తుంటాయని, దీంతో అలల ఉదృతి అధికంగా ఉండడం సహజమేనన్నారు. పౌర్ణమి కావడంతో అలల ఉధృతి పెరిగి సముద్రపు ఆలయ పరిసరాల వరకు నీరు చేరిందన్నారు. ఇలాంటి విపత్తులు ఏర్పడే సమయంలో హెచ్చరికలు చేసే అలారం వాతావరణ కేంద్రం వద్ద ఉందని, ఇలాంటి విపత్తులపై ముందుగానే హెచ్చరిస్తే ప్రాణ, ఆస్తినష్టం నివారించేందుకు వీలుంటుందని స్థానికులు అభిప్రాయపడ్డారు.


కన్నియాకుమారి తీరంలో...

కన్నియాకుమారిలో ప్రాంతంలో ఇటీవల ఆటుపోట్లు అధికమయ్యాయి. సోమవారం ఉదయం సుమారు 50 అడుగుల వరకు నీరు వెనక్కి వెళ్లింది. దీంతో బండరాళ్లు, నాచు, ఇసుక దిబ్బలు బయల్పడ్డాయి. వివేకానంద స్మారక మందిరానికి, తిరువళ్లువర్‌ విగ్రహానికి బోట్‌ సవారీని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. 

Updated Date - 2022-05-17T13:10:01+05:30 IST