నేటితో మల్లన్న బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి

ABN , First Publish Date - 2020-02-24T09:29:10+05:30 IST

శైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు పదోరోజు ఆదివారం వేద పండితులు పూర్ణాహుతిని వైభవంగా నిర్వహించారు. భ్రమరాంబ మల్లికార్జునులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాగశాలలో చండీశ్వరునికి ప్రత్యేక పూజలు, రుద్రహోమ

నేటితో మల్లన్న బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి

శ్రీశైలం, ఫిబ్రవరి 23: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు పదోరోజు ఆదివారం వేద పండితులు పూర్ణాహుతిని వైభవంగా నిర్వహించారు. భ్రమరాంబ మల్లికార్జునులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాగశాలలో చండీశ్వరునికి ప్రత్యేక పూజలు, రుద్రహోమ పూర్ణాహుతి, వసంతోత్సవం, అవభృదం, త్రిశూల స్నానం నిర్వహించారు. ధ్వజపటాన్ని అవరోహణ చేశారు. బ్రహ్మోత్సవాల చివరిరోజు సోమవారం సాయంత్రం భ్రమరాంబ సమేత మల్లికార్జు స్వామివారికి అశ్వవాహనసేవ, ఉత్సవ ఊరేగింపు జరుపుతారు. అనంతరం అక్కమహాదేవి అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంతసేవ నిర్వహిస్తారు. అంతటితో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. 

Updated Date - 2020-02-24T09:29:10+05:30 IST