Sep 23 2021 @ 19:38PM

మహాసముద్రం: మీరు చేస్తే నీతి.. మేం చేస్తే బూతా?

‘ఆర్‌ఎక్స్‌ 100’ దర్శకుడిగా నిరూపించుకున్న అజయ్‌ భూపతి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ మహా సముద్రం’. శర్వానంద్‌, సిద్థార్థ్‌ ప్రధాన పాత్రధారులు. అదితీరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. వచ్చే నెల 14న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. గురువారం ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. సముద్రం సన్నివేశంతో ట్రైలర్‌ ప్రారంభమైంది. ‘సముద్రం చాలా గొప్పది. చాలా రహస్యాల్ని తనలోనే దాచుకుంటుంది’ అంటూ శర్వానంద్‌ ఎంట్రీ ఇచ్చిన తీరు ఆకట్టుకుంటోంది. ‘‘ఇక్కడ మనకి నచ్చినట్టు బతకాలంటే.. మన జాతకాల్ని దేవుడు మందుకొట్టి రాసుండాలి’’ అంటూ శర్వానంద్‌ చెప్పే డైలాగ్‌.. ‘‘మీరు చేేస్త నీతి.. నేను చేేస్త బూతా’’ అంటూ సిద్థార్థ్‌ పలికే సంభాషణలు అలరిస్తున్నాయి. ‘‘నేను దూరదర్శన్‌లో మహాభారత యుద్థం చూసిన మనిషినిరా.. ఎదుటోడు వేసిన బాణానికి ఎదురు ఏ బాణం వేయాలో నాకు బాగా తెలుసు’’ అంటూ రావు రమేశ్‌ తన స్టైల్‌లో డైలాగ్‌ చెప్పడం ఆకట్టుకుంటోంది.