Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘మహాపాదయాత్ర’కు చిట్టేపల్లి గ్రామస్థుల విరాళం

పొదలకూరు, డిసెంబరు 2 : అమరావతి రైతుల మహాపాదయాత్రకు మండలంలోని చిట్టేపల్లికి చెందిన నాయకులు, రైతులు రూ.40వేల నగదు విరాళం గురువారం అందజేశారు. జై అమరావతి నినాదాలు చేస్తూ మహాపాదయాత్రకు పొదలకూరు మండల ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలికారు. యాత్ర విజయవంతం కావాలని వివిధ సంఘాలు, రాజకీయ పార్టీలు రైతుల మద్దతు తెలిపాయి. మాజీమంత్రి సోమిరెడ్డి  చంద్రమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో  అమరావతి రైతులకు చిట్టేపల్లి గ్రామం తరపున రూ.40వేలను మండల పార్టీ అధ్యక్షుడు తలచీరు మస్తాన్‌బాబుకు అందించారు. కార్యక్రమంలో కోవూరు బక్కయ్యనాయుడు, కొమ్మి చిరంజీవినాయుడు, గంగవరపు దయాకర్‌నాయుడు, మంచు శీనయ్యనాయుడ, దేవినేని భాస్కర్‌నాయుడు, తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement