మహా పాదయాత్రకు స్వాగతం

ABN , First Publish Date - 2022-09-29T06:04:28+05:30 IST

మన ఆంధ్రప్రదేశ్‌కు అమరావతే రాజధాని కావాలని కోరుతూ 16వ రోజు ఏలూరు నియోజకవర్గంలోని ఏలూరు, పాలగూడెం గ్రామాల్లో మహాపాదయాత్ర ముగించుకుని 17వ రోజు దెందులూరు మండలంలోకి ప్రవేశించింది.

మహా పాదయాత్రకు స్వాగతం
శ్రీవారి రథానికి వేస్తున్న గజమాల

కొవ్వలిలో హారతులిచ్చిన మహిళలు 

స్వచ్ఛంద సంస్థలు, టీడీపీ నాయకులు, రైతు సంఘాల మద్దతు 

దెందులూరు, సెప్టెంబరు 28 : మన ఆంధ్రప్రదేశ్‌కు అమరావతే రాజధాని కావాలని కోరుతూ 16వ రోజు ఏలూరు నియోజకవర్గంలోని ఏలూరు, పాలగూడెం గ్రామాల్లో మహాపాదయాత్ర ముగించుకుని 17వ రోజు దెందులూరు మండలంలోకి ప్రవేశించింది.  కొవ్వలి గ్రామంలో మొండుకోడు కరకట్ట అడ్డరోడ్డు వద్దకు వచ్చిన మహా పాదయాత్ర రైతులకు కొవ్వలి రైతులు, మహిళలు, టీడీపీ నేతలు భారీ స్వాగతం పలికారు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, మాజీ ఎంపీ మాగంటి బాబు పాదయాత్రలో నడిశారు. అమరావతి నుంచి వస్తున్న వేంకటేశ్వరస్వామి రథానికి గజమాలను వేసి పూజలు చేశారు. గాంధీ నగర్‌, రాజులపేట మీదుగా కొవ్వలి గ్రామంలో ఏర్పాటు చేసిన మోటపర్తి భవనం, రామదాసు భవనంలోను రైతులకు ఆతిఽథ్యం ఇచ్చారు. పసుపు. కుంకుమ అందజేసి విడిది ఏర్పాటు చేశారు. పలు స్వచ్చంద సంస్థతో పాటుగా రైతు సంఘాలు మద్దతు ప్రకటించారు.

పాదయాత్రను కించపరచడం తగదు : శివారెడ్డి 

మంత్రులు మా పాదయాత్రను కించపరిచేలా మాట్లాడం తగదని అమరావతి పరిరక్షణ రైతు సమితి కన్వీనర్‌ శివా రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి కొవ్వలిలో ఆయనతోపాటు అమరావతి సాధన సమితి కోకన్వీనర్‌ తిరుపతిరావు, మహిళానేత సీతారత్నం మాట్లాడుతూ ఒక మహా సంకల్పంతో అమరావతిని రాజధానిగా ఉంచాలనే లక్ష్యంతో పాదయాత్ర చేస్తున్నామని, అన్ని వర్గాలు స్వాగతం పలుకుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అమరావతినే ఏకైక రాజధానిగా రాజదానిగా ప్రకటించాలన్నారు. 


మహాపాదయాత్రకు టీడీపీ శ్రేణుల మద్దతు 

కామవరపుకోట, సెప్టెంబరు 28 : స్థానిక టీడీపీ నాయకులు పలువురు బృందంగా ఏర్పడి అమరావతి రైతులు చేస్తున్న మహా పాదయాత్రకు మద్దతు తెలిపేందుకు మాజీ ఎంపీ మాగంటి బాబు సమక్షంలో ఏలూరు వెళ్లి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. చింతలపూడి ఏఎంసీ మాజీ చైర్మన్‌ కోనేరు వెంకట సుబ్బారావు నెక్కలపు గంగాధరరావు, రైతు సంఘ నాయకులు కోనేరు వెంకట్రామయ్య, జయకృష్ణ తదితరులు ఉన్నారు.


అమరావతి అందరిది : చింతమనేని 

పెదవేగి, సెప్టెంబరు 28 : అమరావతి ఐదు కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అని, దానికి కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అన్నారు. అమరావతి నుంచి అరసవెల్లి వరకు సాగుతున్న మహాపాదయాత్ర దెందులూరు నియోజకవర్గం కొవ్వలిలో గురువారం అడుగుపెడుతున్న సంద ర్భంగా ఆయన మాట్లాడారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అమరావతి రాజధాని కావాలని అభిలషించే అభిమానులందరూ మహాపాదయాత్రకు సహకరించాలన్నారు. 


ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం తగదు : ముప్పిడి 

ద్వారకాతిరుమల, సెప్టెంబరు 28 : సీఎం జగన్‌ మూడు రాజధానుల పేరిట ప్రాంతాలు, కులాల మధ్య చిచ్చుపెడు తున్నారని గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఎద్దేవా చేశారు. ద్వారకా తిరుమలలోని వైష్ణవి హోటల్‌ వద్ద బుధవారం విలేకరులతో మాట్లాడారు. మంత్రులు అంబటి, బొత్స అసందర్భ ప్రేలాపనలు చేసు ్తన్నారని, వారికి దమ్ముంటే రైతుల పాదయాత్రను ఆపి చూడాలని సవాల్‌ విసిరారు. పాదయాత్ర పంగిడిగూడెం వద్దకు ఈనెల 30న వ్రేశిస్తుందని, ఆరోజు ఘన స్వాగతం పలుకుతామన్నారు. మల్లిపెద్ది వెంకటేశ్వర రావు, సుంకవల్లి బ్రహ్మయ్య, ఘంటా బాబ్జీ, నాని, గంటా అచ్యుతారామయ్య, ఉన్నారు.

Updated Date - 2022-09-29T06:04:28+05:30 IST