మహానాడుకు భారీగా తెలుగుతమ్ముళ్లు

ABN , First Publish Date - 2022-05-29T02:51:57+05:30 IST

ఒంగోలులో జరుగుతున్న మహానాడుకు శనివారం కందుకూరు నియోజకవర్గం నుంచి పెద్దసంఖ్యలో తరలివెళ్లారు. వందల సంఖ్యలో మోటా

మహానాడుకు భారీగా తెలుగుతమ్ముళ్లు
కందుకూరు నుంచి ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మోటారు సైకిళ్ల ర్యాలీగా వెళ్తున్న నాయకులు, కార్యకర్తలు


కందుకూరు, మే 28: ఒంగోలులో జరుగుతున్న మహానాడుకు శనివారం కందుకూరు నియోజకవర్గం నుంచి పెద్దసంఖ్యలో తరలివెళ్లారు. వందల సంఖ్యలో మోటారు సైకిళ్లు, కార్లు, ఆటోలు, బస్సుల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలివెళ్లారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన క్యాడర్‌తో కందుకూరు పట్టణం పసుపుమయమైంది. అన్ని ప్రాంతాల నుంచి వాహనాలకు పసుపు జెండాల రెపరెపలతో తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్‌ విగ్రహం వద్దకు చేరుకోగా, అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్‌చార్జి ఇంటూరి నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే దివి శివరాం తదితరులు ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఇన్‌చార్జి ఇంటూరి నాగేశ్వరరావు మోటారు సైకిల్‌ నడుపుతూ ర్యాలీలో పాల్గొనగా, యువకులు ఉత్సాహంగా ముందుకు సాగారు. 


 కలిగిరిలో...


కలిగిరి : మహానాడుకు మండలంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శనివారం భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. మాజీ ఎమ్మెల్యే బొల్లినేని సూచనల మేరకు మండలంలోని  వివిధ గ్రామాలకు చెందిన నాయకులు  ఉదయాన్నే స్థానిక పార్టీ కార్యాలయానికి చేరుకొని 50 వాహనాల్లో తరలి వెళ్ళారు.


వలేటివారిపాలెంలో...


వలేటివారిపాలెం, మే 28 : మండలంలోని అన్ని గ్రామాల నుంచి  ఒంగోలు మహానాడుకు మండల టీడీపీ అధ్యక్షుడు మాదాల లక్ష్మీనరసింహం ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. వలేటివా రిపాలెం, బడేవారిపాలెం నుంచి రెండు బస్సులలో కార్యకర్తలు వెళ్లారు. కార్యక్రమంలో  నాయకులు  నవ్వులూ రి రాజారమేష్‌, వలేటి నరసింహం, ప్రెగడ శ్రీనివాస్‌, కాకుమాను ఆంజనేయులు, చెరువుపల్లి మాల్యాద్రి, ఘటమనేని చెంచురామయ్య తదితరులు పాల్గొన్నారు


జలదంకిలో..


జలదంకి : మహానాడుకు మండల టీడీపీ అధ్యక్షుడు పీ మధుమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో అన్ని గ్రామాల నుంచి టీడీపీ నాయకులు, అభిమానులు 40 ప్రత్యేక వాహనాలలో తరలివెళ్లారు. తరలివెళ్లిన వారిలో నాయకులు వంటేరు జయచంద్రారెడ్డి, పూనూరు భాస్కర్‌రెడ్డి, మందపల్లి మాల్యాద్రియాదవ్‌, కంచర్ల వినోద్‌నాయుడు, ఏగూరి రఘు తదితరులు ఉన్నారు.


లింగసముద్రంలో..


లింగసముద్రం : మహానాడుకు లింగసముద్రం మండ లం నుంచి మండల టీడీపీ అధ్యక్షుడు వేముల గోపాలరావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు శనివారం పెద్దసంఖ్యలో తరలివెళ్లారు. ముందుగా లింగసముద్రంలో టీడీపీ ఆఫీసు వద్ద ఎన్టీఆర్‌ జయంతి వేడుకలు నిర్వహించి అక్కడి నుంచి మహానాడుకు తరలివెళ్లారు. ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు కేక్‌ కట్‌చేసి పంపిణీ చేశారు. మండలంలోని మొగిలిచర్ల, లింగసముద్రం, వీఆర్‌ కోట, పెదపవని తదితర గ్రామాల నుంచి తెలుగుతమ్ముళ్లు భారీగా తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు జి.ప్రసాదు, ఎ. రంగయ్య తదితరులు పాల్గొన్నారు.


బిట్రగుంటలో...


బిట్రగుంట : బోగోలు మండలంలోని 16 పంచాయతీల నుంచి తెలుగు తమ్ముళ్లు మహానాడుకు తరలివెళ్లారు. మండల కన్వీనర్‌ మాలేపాటి నాగేశ్వరావు ఆధ్వర్యంలో శనివారం వారంతా బయలుదేరారు. బోగోలు  కూడలి నుంచి  బయలుదేరిన యాత్రకు మాలేపాటి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాపట్ల వెంకటపతి, కోడూరు వెంకటేశ్వర్లురెడ్డి, కాండ్ర రఘురామ్‌ నాయుడు, కోటా వెంకారెడ్డి, ఎల్‌ సుధీర్‌బాబు, పుట్టా సుబ్బారావు, అంకపునాయుడు,  తదితరులు పాల్గొన్నారు. కాగా జిల్లా యువ నేత రావి విజయకుమార్‌ యాదవ్‌ కొండబిట్రగుంట ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఉత్తర మెట్లకు పూజలు చేసి మహానాడుకు బయలుదేరారు.



----------------


Updated Date - 2022-05-29T02:51:57+05:30 IST