Abn logo
Sep 17 2021 @ 01:31AM

గవాస్కర్‌పై ‘మహా’ మంత్రి అసంతృప్తి

ముంబై: ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో క్రికెట్‌ అకాడమీని ఏర్పాటు చేయకపోవడంపై టీమిండియా మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌పై మహారాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జితేంద్ర అవహాద్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 35 ఏళ్ల క్రితం గవాస్కర్‌ అకాడమీ కోసం బాంద్రాలో 2 వేల చదరపు మీటర్ల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. కానీ, ఇప్పటివరకు ఆ అకాడమీ కార్యరూపం దాల్చక పోవడంపై జితేంద్ర అసహనం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశారు. 1986లో సునీల్‌ గవాస్కర్‌ క్రికెట్‌ ఫౌండేషన్‌ ట్రస్ట్‌కు ఈ స్థలాన్ని కేటాయించారు.