మోదీ ప్రసంగంపై మహా ప్రభుత్వం అసంతృప్తి

ABN , First Publish Date - 2021-04-21T03:22:42+05:30 IST

రోనాను ఎదుర్కోవడానికి రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ఇస్తుందనుకుంటే మోదీ ఇంకేదో మాట్లాడారని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ అన్నారు. మోదీ ప్రసంగం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కోవిడ్‌ను ఎదుర్కోవడానికి రాష్ట్రాలకు కేంద్ర సహకారం కావాలని అన్నారు

మోదీ ప్రసంగంపై మహా ప్రభుత్వం అసంతృప్తి

ముంబై: దేశంలో విజృంభిస్తున్న కోవిడ్ రెండవ దశపై మంగళవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన ప్రసంగంపై మహారాష్ట్ర ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనాను ఎదుర్కోవడానికి రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ఇస్తుందనుకుంటే మోదీ ఇంకేదో మాట్లాడారని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ అన్నారు. మోదీ ప్రసంగం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కోవిడ్‌ను ఎదుర్కోవడానికి రాష్ట్రాలకు కేంద్ర సహకారం కావాలని అన్నారు.


‘‘లాక్‌డౌన్ అనేది తప్పనిసరి అయితే కానీ నిర్ణయం తీసుకోకూడదని ప్రధానమంత్రి చెప్పారు. కానీ కోర్టులు ఏమో లాక్‌డౌన్ విధించమంటూ రాష్ట్రాలకు ఆదేశాలు ఇస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ప్రజలు ఉద్దీపన చర్యలు కోరుకుంటున్నారు. వలస కూలీలు, పేదలు, చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వారికి ప్యాకేజీ ప్రకటిస్తారని అనుకున్నాం. కానీ ప్రధాని ప్రసంగంలో అది కనిపించలేదు’’ అని నవాబ్ మాలిక్ అన్నారు.

Updated Date - 2021-04-21T03:22:42+05:30 IST