వైభవంగా జ్యోతి మహోత్సవం

ABN , First Publish Date - 2022-10-07T05:01:00+05:30 IST

పట్టణంలో జ్యోతి మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. నాగులకట్ట, కన్నెలూరు, తదితర వీధుల్లో తొగటవీర క్షత్రియులు దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారికి ప్రతిరూపమైన జ్యోతులను తయారు చేసి ఊరేగింపు చేశారు.

వైభవంగా జ్యోతి మహోత్సవం
జమ్మలమడుగులో జ్యోతులను ఊరేగింపుగా తీసుకెళుతున్న భక్తులు

జమ్మలమడుగు రూరల్‌, అక్టోబరు 6: పట్టణంలో జ్యోతి మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. నాగులకట్ట, కన్నెలూరు, తదితర వీధుల్లో తొగటవీర క్షత్రియులు దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారికి ప్రతిరూపమైన జ్యోతులను తయారు చేసి ఊరేగింపు చేశారు. పట్టణంలో శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరీదేవి, శ్రీమదాంబ భవానీ, ప్రసన్న వెంకటేశ్వరస్వామి, ముద్దనూరు రోడ్డులోని సా యిబాబా ఆలయంలో, రాజరాజేశ్వరీదేవి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. బుధవారం రాత్రి వర్షపు జల్లులు కురిశాయి. దీంతో రాత్రి ఊరేగింపుపై కొంత ఆటంకం కలిగించింది. ఉదయాన్నే భారీ వర్షం కురిసింది. ఈ సందర్భంగా పలు ప్రాంతాల భక్తులు దసరా శరన్నవరాత్రుల్లో ఆలయాలను దర్శించుకున్నారు. 

Updated Date - 2022-10-07T05:01:00+05:30 IST