మాగ్నెట్‌లు మింగి.. ఆసుపత్రిలో చేరి!

ABN , First Publish Date - 2021-02-16T08:59:10+05:30 IST

పిల్లలు చేసే పనులు కొన్నిసార్లు వికటించి, ప్రమాదాలను తెచ్చిపెడతాయి. ఇందుకు మంచి ఉదాహరణ మాంచెస్టర్‌కు చెందిన పన్నెండేళ్ల రిలే మోరిసన్‌.

మాగ్నెట్‌లు మింగి.. ఆసుపత్రిలో చేరి!

పిల్లలు చేసే పనులు కొన్నిసార్లు వికటించి, ప్రమాదాలను తెచ్చిపెడతాయి. ఇందుకు మంచి ఉదాహరణ మాంచెస్టర్‌కు చెందిన పన్నెండేళ్ల రిలే మోరిసన్‌. అయస్కాంతం ఇనుమును ఆకర్షిస్తుంది. మరి అయస్కాంతం మింగితే పొట్టలో నుంచి కూడా ఐరన్‌ను ఆకర్షిస్తుందా? అది తెలుసుకోవడానికి ఏకంగా 54 అయస్కాంతాలను మింగాడు మోరిసన్‌.


మోరిసన్‌కు ప్రయోగాలంటే బాగా ఆసక్తి. ఆ ఆసక్తే ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. 54 మాగ్నెట్‌లు మింగిన విషయం తల్లికి చెప్పకుండా దాచాడు. కడుపునొప్పి ఎక్కువ కావడంతో పొరపాటున రెండు మాగ్నెట్‌లు మింగేసానని చెప్పాడు. 

ఆసుపత్రికి వెళితే ఎక్స్‌రే తీసిన వైద్యులు ఎక్కువ మాగ్నెట్‌లు ఉన్నట్టు గుర్తించారు. సర్జరీ చేసి వాటిని బయటకు తీశారు. అప్పుడు లెక్కిస్తే వాటి సంఖ్య 54గా తేలింది.

మోరిసన్‌లా మరే పిల్లాడు చేయకూడదని వాళ్ల అమ్మ ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. అనవసర ప్రయోగాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని పిల్లలను కోరారు. 

Updated Date - 2021-02-16T08:59:10+05:30 IST