గాలిలో అగ్గిపుల్ల!

ABN , First Publish Date - 2020-06-26T05:30:00+05:30 IST

మీ స్నేహితులను పిలవండి. మండుతున్న అగ్గిపుల్లను ముట్టుకోకుండా గాల్లోకి లేచేలా చేస్తాను అని చెప్పండి. ఎలా చేయాలంటే...

గాలిలో అగ్గిపుల్ల!

మీ స్నేహితులను పిలవండి. మండుతున్న అగ్గిపుల్లను ముట్టుకోకుండా గాల్లోకి లేచేలా చేస్తాను అని చెప్పండి. ఎలా చేయాలంటే...


  1. ఒక ఖాళీ అగ్గిపెట్టె తీసుకుని టేబుల్‌పై పెట్టండి. 
  2. ఒక అగ్గిపుల్లను నిటారుగా నిలబడి ఉండేలా అగ్గిపెట్టెపై అతికించండి. మండే భాగం పైకి ఉండాలి.
  3. మరో అగ్గిపుల్ల తీసుకోండి. అతికించిన అగ్గిపుల్లకు 45 డిగ్రీల కోణంలో దాన్ని ఆనించి పెట్టండి. కానీ మండే భాగాలు రెండూ కలిసి ఉండాలి.
  4. మీ మ్యాజిక్‌ ఇక మొదలవుతుంది. ఆ రెండు అగ్గిపుల్లలను అంటించండి. అగ్గిపుల్లలు అంటుకుని మండడం ప్రారంభం కాగానే 45 డిగ్రీల కోణంలో ఉంచిన అగ్గిపుల్ల గాల్లోకి లేవడాన్ని చూడొచ్చు. 
  5. అది ఎలా జరిగిందంటే... రెండు అగ్గిపుల్లలూ ఒకేసారి అంటుకోవడం వల్ల అధిక మొత్తంలో ఉష్ణం ఉత్పత్తి అయింది. అప్పుడు ఆ రెండు భాగాలు కలిసిపోయాయి. ఫలితంగా కింద అంటించని అగ్గిపుల్ల గాలిలోకి లేచింది. 

Updated Date - 2020-06-26T05:30:00+05:30 IST