రుమాలుతో మ్యాజిక్‌!

ABN , First Publish Date - 2020-03-27T04:40:47+05:30 IST

మీ స్నేహితులకు ఖాళీ చేతులను చూపించండి. ఇప్పుడు ఆ ఖాళీ చేతుల్లో నుంచి రుమాలును పుట్టిస్తానని చెప్పండి. అదెలా? అని వాళ్లు ఆశ్చర్యపోతారు....

రుమాలుతో మ్యాజిక్‌!

మీ స్నేహితులకు ఖాళీ చేతులను చూపించండి. ఇప్పుడు ఆ ఖాళీ చేతుల్లో నుంచి రుమాలును పుట్టిస్తానని చెప్పండి. అదెలా? అని వాళ్లు ఆశ్చర్యపోతారు. ఇదిగో ఇలా చేయండి. 

కావలసినవి:

శరీరం రంగులో ఉండే దారం

చిన్న రుమాలు

ఈ మ్యాజిక్‌ చేయాలంటే మీరు ఫుల్‌ షర్ట్‌ వేసుకొని ఉండాలి. కోటు వేసుకుంటే మరీ మంచిది. దారం ఒక చివర చేతి రుమాలుకు కట్టి కోటు చేతుల లోపల దాచాలి. దారం రెండో చివర ఒక రింగులా చేసి చేతి మధ్య వేలుకు తగిలించుకోండి. మ్యాజిక్‌ చేసే ముందు రెండు చేతులు ఖాళీగా ఉన్నాయని అందరికీ చూపించండి. ‘ఇప్పుడు చూడండి ఒక రుమాలు పుట్టిస్తాను’ అని చెబుతూ రెండు అర చేతులూ ఒకదానికొకటి రుద్దండి. చేతులను రుద్దుకుంటూ అరచేతిలో ఉన్న దారాన్ని కూడా ఉండలా నలపాలి. అలా నలుపుతూ కోటు లోపల దాగిన రుమాలును చేతిలోకి తెచ్చుకోవాలి. అలా బయటకు తెచ్చేటప్పుడు అందరికీ కనిపించకుండా జాగ్రత్తగా చేయాలి. 

Updated Date - 2020-03-27T04:40:47+05:30 IST