Advertisement
Advertisement
Abn logo
Advertisement

స్ఫూరిప్రదాత మాజేటి గురయవ్య

గుంటూరు(విద్య), అక్టోబరు 25: సమాజాభివృద్ధిలో విద్య పాత్రను గుర్తించి స్వాతంత్ర్యానికి పూర్వమే విద్యాసంస్థల్ని నెలకొల్పి విద్యాభివృద్ధికి కృషి చేసిన స్ఫూర్తిప్రదాత మాజేటి గురవయ్య అని డాక్టర్‌ భోగరాజు వెంకట విజయభాస్కర్‌ తెలిపారు. సోమవారం మాజేటి గురవయ్య వర్ధంతి సందర్భంగా బ్రాడీపేటలోని విద్యాసంస్థల్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆయన స్ఫూర్తిని విద్యార్థులు స్మరించుకోవాలన్నారు.  చార్టెర్డ్‌ అకౌంటెంట్‌ డాక్టర్‌ కేఎస్‌ఆర్‌ కుటుంబరావు మాట్లాడుతూ మాజేటి గురవయ్య ఆధ్యాత్మిక రంగాలకు విశేష సేవలు అందించారని తెలిపారు. కార్యక్రమంలో జూనియర్‌ కళాశాల కార్యదర్శి ఎంవీఆర్‌కే ముత్యాలు, పాఠశాల కార్యదర్శి ఎంవీఎస్‌ రామ్‌ప్రసాద్‌, జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మాధవపెద్ది విజయలక్ష్మి, హెచఎం శారదాదేవి, పాలకమండలి అధ్యక్షుడు గుడివాడ చంద్రారావు తదితరులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement