మాడుగుల-దేవాపురం రోడ్డు పనులు ప్రారంభం

ABN , First Publish Date - 2022-07-06T07:05:24+05:30 IST

అల్లూరి జిల్లా పాడేరు మండలం దేవాపురం నుంచి మాడుగుల ఉబ్బలింగేశ్వర స్వామి ఆలయం వరకు రోడ్డు నిర్మాణ పనులు మంగళవారం ప్రారంభమయ్యాయి.

మాడుగుల-దేవాపురం రోడ్డు పనులు ప్రారంభం
కొండపై ఎక్స్‌కవేటర్‌తో పనులు చేస్తున్న దృశ్యం


మాడుగుల, జూలై 5: అల్లూరి జిల్లా పాడేరు మండలం దేవాపురం నుంచి మాడుగుల ఉబ్బలింగేశ్వర స్వామి ఆలయం వరకు రోడ్డు నిర్మాణ పనులు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న ఈ రోడ్డు నిర్మాణానికి ఇటీవల అటవీ శాఖ అనుమతులు రావడంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. పాడేరు మండలం దేవాపురం నుంచి మాడుగుల 12 మైళ్లు. వంట్లమామిడి మీదుగా రావాలంటే సుమారు 35 కిలోమీటర్లు దూరం వస్తుంది. అయితే ఈ రోడ్డు నిర్మాణం జరిగితే దేవాపురం నుంచి మాడుగుల ఎనిమిది కిలోమీటర్లే.  దాదాపుగా 27 కిలోమీటర్లు దూరం తగ్గుతుంది. రోడ్డు పనులు చేపట్టడంతో గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డు పనులు పూర్తయితే 15 గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం కలుగుతుంది. 

Updated Date - 2022-07-06T07:05:24+05:30 IST