Viral అవుతున్న విదేశీ యువతి వీడియో..! తొలిసారి భారతీయ వంటకాన్ని రుచి చూసి..

ABN , First Publish Date - 2022-02-06T22:23:18+05:30 IST

మసాలాలతో ఉండే భారతీయ వంటకాలకు ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే.. భారతీయ వంటకాలను సర్వ్ చేసే రెస్టారెంట్లు పలు దేశాల్లో ఉన్నాయి. ఇక మ్యాడ్రిడ్‌(స్పెయిన్)కు చెందిన ఓ 20 ఏళ్ల యువతి ఫాతిమా డే టేటాన్ ఇటీవల తొలిసారిగా చికెన్ టిక్కా మసాలాను రుచి చూసింది. అంతే..

Viral అవుతున్న విదేశీ యువతి వీడియో..! తొలిసారి భారతీయ వంటకాన్ని రుచి చూసి..

ఇంటర్నెట్ డెస్క్: మసాలాలతో ఉండే భారతీయ వంటకాలకు ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే.. భారతీయ వంటకాలను సర్వ్ చేసే రెస్టారెంట్లు పలు దేశాల్లో ఉన్నాయి. మన వంటకాల్నీ ఇష్టపడే విదేశీయులు నిత్యం ఇలాంటి రెస్టారెంట్లకు వెళుతుంటారు. ఇక మ్యాడ్రిడ్‌(స్పెయిన్)కు చెందిన ఓ 20 ఏళ్ల యువతి ఫాతిమా డే టేటాన్ ఇటీవల తొలిసారిగా చికెన్ టిక్కా మసాలాను రుచి చూసింది. అంతే.. ఆమె మొహం ఒక్కసారిగా వంద వోల్ట్‌‌ల బల్బ్‌లా వెలిగిపోయింది. ‘‘వావ్.. ఇది భలే అద్భుతం. ఇంత రుచికరమైన ఆహారాన్ని ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా నేను తినకపోవడం ఏంటో..’’ అంటూ ఆశ్చర్యపోయింది. ఆ తరువాత.. నాన్ లేకుండానే నేరుగా చికెన్ టిక్కా మసాలాను రుచి చూసి మరోమారు షాకైపోయింది. ఇంతటి రుచికరమైన ఫుడ్ ఉందా అంటూ నమ్మలేనట్టు కళ్లు పెద్దవి చేసేసింది. ‘‘నా లైఫ్‌లో ఇంత మంచి ఫుడ్ ఎప్పుడూ తినలేదు. ఇప్పుడు నాకో కొత్త హాబీ అలవడింది. ఇకపై నేను సంప్రదాయక వంటకాలన్నింటినీ ట్రై చేస్తా’’ అని చెప్పింది ఫాతిమా. 


మన ఫుడ్ తింటూ ఆమె ఇచ్చిన రియాక్షన్ తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటి వరకూ ఈ వీడియోకు ఏడు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయంటే ఏ రేంజ్‌లో ట్రెండ్ అవుతోందో ఇట్టే ఊహించుకోవచ్చు. ఈ వీడియోను చూసిన భారతీయులు కూడా ఇదే స్థాయిలో కామెంట్లు పెడుతున్నారు.. ‘‘సిస్టర్.. మా భారతీయ వంటకాలు అన్నిటికంటే బెస్ట్..’’ అంటూ ఓ నెటిజన్ రిప్లై ఇచ్చింది. ఇతరులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరి కొంతమంది మాత్రం కాస్త దక్షిణాది వంటకాలను కూడా ట్రై చేయండి అని ఆమెకు సూచించారు. కాగా..  మ్యాడ్రిడ్‌లోని ‘ఉదయ్‌పూర్’ అనే రెస్టారెంట్‌లో ఫాతిమా భారతీయ వంటకాన్ని ట్రై చేసింది.  మరి ఇంతగా వైరల్ అవుతున్న వీడియోపై మీరు ఓ లుక్కేస్తే పోలా..



Updated Date - 2022-02-06T22:23:18+05:30 IST