మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-11-18T00:38:15+05:30 IST

మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీబ్

మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు

చెన్నై : మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీబ్ బెనర్జీ న్యాయస్థానం ఉద్యోగులు, తదితరులకు సంచలన సందేశం ఇచ్చారు. ఈ న్యాయస్థానంలో ఫ్యూడల్ సంస్కృతిని ధ్వంసం చేయలేకపోయినందుకు తాను తీవ్రంగా విచారిస్తున్నానని చెప్పారు. తనకు సంపూర్ణ సహకారం అందించిన హైకోర్టు ఉద్యోగులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఈ న్యాయస్థానంలో ఫ్యూడల్ సంస్కృతిని పూర్తిగా నిర్మూలించలేకపోయినందుకు విచారిస్తున్నానని చెప్పారు.  


జస్టిస్ సంజీబ్ బెనర్జీ మేఘాలయ హైకోర్టుకు బదిలీ అయ్యారు. తాను ఈ సుందరమైన, ప్రతిష్ఠాత్మకమైన రాష్ట్రం (తమిళనాడు)లో 11 నెలలపాటు పని చేశానని, ఇక్కడి నుంచి చాలా మధుర జ్ఞాపకాలతో  వెళ్తున్నానని తెలిపారు. 


నవంబరు 9న జస్టిస్ సంజీబ్ బెనర్జీని మేఘాలయ హైకోర్టుకు బదిలీ చేసినట్లు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఓ నోటిఫికేషన్ ద్వారా తెలిపింది.


Updated Date - 2021-11-18T00:38:15+05:30 IST