పరోక్ష ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించండి

ABN , First Publish Date - 2022-03-01T13:42:17+05:30 IST

మేయర్‌, డిప్యూటీ మేయర్‌, చైర్మన్‌ పదవులకు సంబం ధించిన పరోక్ష ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను మద్రాసు హైకోర్టు ఆదేశించింది. శివగంగ జిల్లా దేవకోట మున్సి పాలిటీకి ఈ

పరోక్ష ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించండి

                           - Madras highcourt


ప్యారీస్‌(చెన్నై): మేయర్‌, డిప్యూటీ మేయర్‌, చైర్మన్‌ పదవులకు సంబం ధించిన పరోక్ష ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను మద్రాసు హైకోర్టు ఆదేశించింది. శివగంగ జిల్లా దేవకోట మున్సి పాలిటీకి ఈ నెల 19న జరిగిన ఎన్నికల్లో గెలిచిన సుందరలింగం సహా 15 మంది అన్నాడీఎంకే కౌన్సిలర్లు, మార్చి 4న జరుగనున్న పరోక్ష ఎన్నికలను వాయిదావేయకుండా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఉత్తర్వులు జారీచేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలుచేశారు. అందులో, తమను అధికార పార్టీ వారు బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఈ పిటిషన్‌పై సోమవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మునీశ్వరనాధ్‌ భండారీ, న్యాయమూర్తి భరత చక్రవర్తి నేతృత్వంలోని ప్రథమ ధర్మాసనం విచారణ చేపట్టింది. పరోక్ష ఎన్నికల ప్రక్రియను సీసీ కెమెరాలో రికార్డు చేయడంతో పాటు అవసరమైన పోలీసు భద్రతను కల్పిస్తామని, పరోక్ష ఎన్నికలు వాయిదావేసే ఉద్ధేశం లేదని ఎన్నికల కమిషన్‌ తరఫున హాజరైన న్యాయవాది  వివరించారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, పరోక్ష ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలని ఈసీకి స్పష్టం చేసింది.

Updated Date - 2022-03-01T13:42:17+05:30 IST