ఆ టైంలో మందు అమ్మొద్దు: న్యూ ఇయర్ వేడుకలపై హైకోర్టు

ABN , First Publish Date - 2021-12-30T02:55:07+05:30 IST

కొత్త సంవత్సరం వేడుకలకు సిద్ధమవుతోన్న మందుబాబులకు చెన్నై హైకోర్టు షాక్ ఇచ్చింది. కేంద్ర పాలిత ప్రాంతమైన పాండిచ్చేరిలో డిసెంబర్ 31 రాత్రి 10:00 గంటల నుంచి జనవరి 1 మధ్యరాత్రి 1:00 గంటల వరకు మద్యం అమ్మకూడదని

ఆ టైంలో మందు అమ్మొద్దు: న్యూ ఇయర్ వేడుకలపై హైకోర్టు

చెన్నై: కొత్త సంవత్సరం వేడుకలకు సిద్ధమవుతోన్న మందుబాబులకు చెన్నై హైకోర్టు షాక్ ఇచ్చింది. కేంద్ర పాలిత ప్రాంతమైన పాండిచ్చేరిలో డిసెంబర్ 31 రాత్రి 10:00 గంటల నుంచి జనవరి 1 మధ్యరాత్రి 1:00 గంటల వరకు మద్యం అమ్మకూడదని ఆదేశాలు జారీ చేసింది. మూడు గంటల పాటు వైన్ షాపుల్లో కానీ బార్‌లలో కానీ మద్యం విక్రయాలు చేపట్టరాదని స్పష్టం చేసింది. కొవిడ్ పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్న కారణంగా కొత్త సంవత్సరం వేడుకల్ని పూర్తిగా రద్దు చేయాలంటూ ఒక వ్యక్తి వేసిన పిటిషన్‌ను విచారించిన అనంతరం జస్టిస్ ఎస్.వైద్యనాథన్, జస్టిస్ డి.భరత చక్రవర్తి‌ల ధర్మాసనం మూడు గంటల మధ్య నిషేధం విధించింది. ఈ సందర్భంగా కోర్టు ‘‘నయం చేయడం కంటే నివారించడం చాలా అవసరం’’ అని వ్యాఖ్యానించింది. ఇక డిసెంబరు 31వ తేదీ రాత్రి 7:00 గంటల తర్వాత టీకా రెండు డోస్‌లు తీసుకున్న వారు మాత్రమే పుదుచ్చేరిలోని బహిరంగ ప్రదేశాల్లోకి అనుమతించాలని కోర్టు ఆదేశించింది. పుదుచ్చేరి ప్రభుత్వం జనవరి 1వ తేది అర్థరాత్రి 1:00 గంటల నుంచి ఉదయం 5:00 గంటల వరకు నైట్ కర్ఫ్యూ విధించింది. ఎక్కువ మంది గుమికూడరాదని ఆదేశించింది.

Updated Date - 2021-12-30T02:55:07+05:30 IST