Duraiswamy: మద్రాసు హైకోర్టు తాత్కాలిక సీజేగా దురైస్వామి

ABN , First Publish Date - 2022-09-14T13:17:55+05:30 IST

ఘనచరిత్ర కలిగిన మద్రాసు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ దురైస్వామి(Justice Duraiswamy) మంగళవారం బాధ్యతలు

Duraiswamy: మద్రాసు హైకోర్టు తాత్కాలిక సీజేగా దురైస్వామి

పెరంబూర్‌(చెన్నై), సెప్టెంబరు 13: ఘనచరిత్ర కలిగిన మద్రాసు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ దురైస్వామి(Justice Duraiswamy) మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు సీజేగా వ్యవహరించిన జస్టిస్‌ మునీశ్వరనాధ్‌ భండారీ(Justice Munishwaranadh Bhandari) సోమవారం పదవీవిరమణ చేశారు. ఆయన స్థానంలో హైకోర్టు సీనియర్‌ న్యాయమూర్తిగా వున్న దురైస్వామిని తాత్కాలిక సీజేగా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. ఆ మేరకు బాధ్యతలు స్వీకరించిన జస్టిస్‌ దురైస్వామి తనకు కేటాయించిన గదిలో జస్టిస్‌ సుందరమోహన్‌తో కలసి ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై విచారణ చేపట్టారు. గతంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన జస్టిస్‌ సంజీవ్‌ బెనర్జీ బదిలీ అయిన సమయంలో కూడా జస్టిస్‌ దురైస్వామి మద్రాసు హైకోర్టు(Madras High Court) తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. ఆయన ప్రస్తుతం రెండోసారి ఆ పదవిలో ఈ నెల 21న పదవీవిరమణ చేసేంత వరకు కొనసాగుతారు. తాత్కాలిక సీజీగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్‌ దురైస్వామికి సహచర న్యాయమూర్తులు, న్యాయవాదుల సంఘాలు అభినందనలు తెలిపాయి.

Updated Date - 2022-09-14T13:17:55+05:30 IST