Abn logo
Oct 16 2020 @ 22:42PM

జగన్ లేఖను ఖండించిన మద్రాస్ హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్

Kaakateeya

ఢిల్లీ : దేశ అత్యున్న న్యాయస్థానం సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులకు వ్యతిరేకంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డేకు రాసిన లేఖ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ లేఖను పలువురు ప్రముఖులు, పేరుగాంచిన మాజీ న్యాయమూర్తులు, అడ్వకేట్ అసోసియేషన్‌లు తీవ్రంగా ఖండిస్తున్నాయి.


తాజాగా.. ఈ లేఖపై మద్రాస్ హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ స్పందిస్తూ తీవ్రంగా ఖండించింది. న్యాయవ్యవస్థపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని వొమ్ము చేసేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని అసోసియేషన్ తీవ్రస్థాయిలో మండిపడింది. ఎన్వీ రమణపై ఆరోపణలను మద్రాస్ హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ ఖండిస్తున్నామని తెలిపింది.

Advertisement
Advertisement
Advertisement