ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రిజర్వేషన్‌ను సమర్ధించిన మద్రాస్ హైకోర్టు

ABN , First Publish Date - 2022-04-07T18:10:21+05:30 IST

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మునిశ్వర్ నాథ్ భండారి, జస్టిస్ డి.భారత చక్రవర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ విషయమై స్పందిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలను మెరుగుపర్చడానికి తగిన చర్యలు తీసుకోవాలని తీసుకోవాలని ఆదేశించింది..

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రిజర్వేషన్‌ను సమర్ధించిన మద్రాస్ హైకోర్టు

చెన్నై: మెడికల్ కోర్సుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు 7.5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గురువారం మద్రాస్ హైకోర్టు సమర్ధించింది. 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు గ్రాడ్యూవేషయన్ మెడికల్ కోర్సుల్లో 7.5 శాతం రిజర్వేషన్‌ను తమిళనాడు ప్రభుత్వం కల్పించింది. సమాజంలోని అట్టడుగు వర్గాలకు చెందిన అర్హులైన విద్యార్థులు మెడికల్ కోర్సుల్లో చేరేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. మెడికల్ అడ్మిషన్లలో గ్రామీణ-పట్టణ, ధనిక-పేద విభజనలను తగ్గించడానికి 7.5 శాతం కోటా సహాయపడుతుందని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది.


ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మునిశ్వర్ నాథ్ భండారి, జస్టిస్ డి.భారత చక్రవర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ విషయమై స్పందిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలను మెరుగుపర్చడానికి తగిన చర్యలు తీసుకోవాలని తీసుకోవాలని ఆదేశించింది. అయితే ఐదేళ్లపాటు నిర్ణయించిన ఈ కోటాపై సమీక్షించాలని, ఐదేళ్లకు మించి పొడగింపు లేకుండా చూసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. అయితే పటిషనర్లు తాజాగా కోటాపై ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 69 శాతం రిజర్వేషన్ అమలులో ఉండగా.. కేవలం 31 మాత్రమే ఓపెన్ కేటగిరీ ఉందని, మళ్లీ తాజాగా 7.5 శాతం కోటాపై వల్ల ఓపెన్ కేటగిరీకి మరింత నష్టం కలుగుతుందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. అయితే పిటిషనర్‌తో కోర్టు విభేదిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించింది.

Updated Date - 2022-04-07T18:10:21+05:30 IST