మదిని దోచే మంకెన పూలు

ABN , First Publish Date - 2022-05-27T04:46:54+05:30 IST

మదిని దోచే మంకెన పూలు

మదిని దోచే మంకెన పూలు

  •  పూలదారిని తలపిస్తున్న పెద్దేముల్‌ రోడ్డు

పెద్దేముల్‌, మే26: మనం రోడ్డుపై వెళ్తున్నపుడు ఎన్నో ప్రకృతి అందాలు కనిపిస్తుంటాయి. కొన్నింటిని చూడగానే ఆహా, వోహో       అనిపిస్తాయి. అక్కడ కాసేపు నిలబడి సేదతీరాలనిపిస్తుంది. ప్రకృతి  ప్రేమికులు, ప్రయాణికులకు అలాంటి అనుభూతినే కలిగిస్తోంది  పెద్దేముల్‌ రోడ్డు. ఆ రహదారి పూలతోటను తలపిస్తోంది. ఇవి చెట్లా...పూలవనమా అన్నంతగా ఆకట్టుకుంటున్నాయి. పెద్దేముల్‌లో హరితహారం కింద నాటిన మంకెనపూల మొక్కలు పెరిగి పెద్దవై పూలు పూసి ఆదారి గుండా వెళ్లే ప్రయాణికులను అలరింపజేస్తున్నాయి. ఎండలో వాహనాలపై వెళ్తున్న ప్రయాణికులు ఆ చెట్లకింద సేదతీరుతూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. 

Updated Date - 2022-05-27T04:46:54+05:30 IST