సెంటు స్థలంలో ఇంటి నిర్మాణం ఎలా సాధ్యం

ABN , First Publish Date - 2020-07-08T10:13:53+05:30 IST

సెంటు స్థలంలో ఇంటి నిర్మాణం ఏలా సాధ్యమవుతుందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మాదినేని ఉమామహేశ్వర్‌నాయుడు ప్రభుత్వాన్ని

సెంటు స్థలంలో ఇంటి నిర్మాణం ఎలా సాధ్యం

టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మాదినేని ఉమా


కళ్యాణదుర్గం, జూలై 7: సెంటు స్థలంలో ఇంటి నిర్మాణం ఏలా సాధ్యమవుతుందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మాదినేని ఉమామహేశ్వర్‌నాయుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించా రు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు మంగళవానం ఇంటి పోరుపై నిరసన చేపట్టారు. పట్టణ సమీపంలోని ముదిగల్లు రోడ్డులో ఏర్పాటు చేసిన ప్రభుత్వ లేఔట్లలో స్థానిక నాయకులతో కలిసి బైటాయించారు. కార్యక్రమంలో నాయకులు దొడగట్ట నారాయణ, మాదినేని మురళి, బిక్కి గోవిందప్ప,కొల్లప్ప, రాజశేఖర్‌చౌదరి, స త్యప్ప, సర్మస్‌, రోషన్‌, పాలవాయి రాము, తలారి ప్రకాష్‌, శ్రీనివాసరెడ్డి, హనుమంతరెడ్డి, రామ్మోహన్‌యాదవ్‌, యా లాటే ఈశ్వరప్ప, కొల్లాపురప్ప, నార్తేనాయక్‌,  బ్రిజేష్‌, శీన,రమణ, రాయల్‌ హర్షా పాల్గొన్నారు. 


కళ్యాణదుర్గం:  పేదలను మోసం చేయడం సరికాదని మా జీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి ధ్వజమెత్తా రు. మంగళవారం ఆయన వ్యక్తిగత కార్యాలయం వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. కార్యక్రమం లో నాయకులు  శివశంకర్‌,  గోళ్ల వెంకటేశులు, జ యం విశ్వనాథ్‌, తిప్పేస్వామి, కొల్లాపురప్ప, రమేష్‌ పాల్గొన్నారు. 


హిందూపురం టౌన్‌: టీడీపీ ప్రభుత్వ హయాంలో టిడ్కో ద్వారా నిర్మించిన ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు కే టా యించాలని తెలుగుదేశం నాయకులు డిమాండ్‌ చేశారు.  మంగళవారం మునిసిపల్‌ కార్యాలయం ఎదుట వారు ని రసన తెలిపారు. మున్సిపల్‌ కమిషనర్‌ భవానీ ప్రసాద్‌కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో అహుడా మా జీ చైర్మన్‌ అంబికా లక్ష్మీనారాయణ, టీడీపీ పట్టణా ధ్యక్షుడు డీఈ రమేష్‌, మోదాశి వకుమార్‌, సనావుల్లా, టై లర్‌ గం గాధరప్ప, నవీన్‌, బాచి, హిదాయతుల్లా, దాదు, చి లమ త్తూరు కన్వీనర్‌ రంగారెడ్డి, ప్రవీణ్‌, లింగప్ప పాల్గొన్నారు. 


గుంతకల్లు: పేదలకు గత ప్రభుత్వాలు ఇచ్చిన పట్టాలను వారికే ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే ఆర్‌ జితేంద్రగౌడు డి మాండ్‌చేశారు. మంగళవారం ఉదయం నివేశన స్థలాల రద్దుపై టీడీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీని నిర్వహించారు. స్థానిక టీడీపీ కార్యాలయం వద్ద నుంచి ర్యాలీగా బయలుదేరిన ఆ పార్టీనాయకులు మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు.  మున్సిపల్‌ కమిషనర్‌ శేషన్నకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ నా య కులు ఇజంతకర్‌ చంద్రశేఖర్‌, బండారు ఆనంద్‌, ప్రతాప్‌ నాయుడు, ఆమ్లెట్‌ మస్తాన్‌ యాదవ్‌, వెంకటేశు లు, జింకల జగన్నాథ్‌, తలారి మస్తానప్ప, సిమెంటు నారాయణ, మహదేవ్‌, కేఎల్‌ నారాయణ పాల్గొన్నారు. 


పుట్లూరు: మండలంలోని కడవకల్లు గ్రామంలో టీడీపీ నాయకులు గోవర్ధన్‌రాజు ఆధ్వర్యంలో మంగళవారం ఇంటిబిల్లులు చెల్లించి నిరుపేదలను ఆదుకోవాలని నిరసన తెలిపారు.

 

శింగనమల: పేదల కోసం వేస్తున్న ఇళ్ల పట్టాలలో వైసీపీ నేతలు ధనార్జన కోసమే లేఔట్ల వేసుకొని దోచుకున్నారని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బండారు శ్రావణిశ్రీ ఆరోపించారు. మంగళవారం  అమె మాట్లాడుతూ పీఎంఏవై,ఎన్టీఆర్‌ గృహా నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు పెండింగ్‌ బిల్లులు ఇవ్యాలన్నారు. చంద్రబాబుకు ప్రజల్లో అదరణ పెరుగుతుందనే సీఎం జగన్‌ ఉద్దేశంతోనే నిరుపేదలను టిడ్‌కో నివాసాల నిర్మాణాలను నిలుపుదల చేశారన్నారు. పీఎంఏవై-ఎన్టీఆర్‌ గృహలను పూర్తి చేయాలని జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు డేగలకృష్ణమూర్తి డిమాండ్‌ చే శారు.  అదేవిధంగా శింగనమలలో టిడ్కో గృహాల వద్ద టీడీపీ నాయకులు అబ్దుల్‌ జిలానీ, చితంబరిదొర, చిదానందనాయుడు, శంకర్‌నారాయణ, సత్తి, రాజుబాబు, జడేజా, రాముడు, అనిల్‌, ఎర్రిస్వామి, రాముడు, సైదా, వెం కటేష్‌, అంజీ, శీనా, చంద్రగౌడ్‌ నిరసన వ్యక్తం చేశారు.


పామిడి: రాష్ట్ర ప్రభుత్వం పేదల సొంతింటి కలను నెరవేర్చాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని టీడీపీ నాయకులు పే ర్కొన్నారు. పట్టణంలోని ఎన్టీఆర్‌ నగర్‌లో నిర్మిస్తున్న ఎన్టీఆర్‌ గృహాల వద్ద మంగళవారం టీడీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రభాకర్‌చౌదరి, గౌస్‌పీరా, ఎంహెచ్‌ లక్ష్మినారాయణరెడ్డి, ఆనంద్‌బాబు, శ్రీనివాసరెడ్డి, జింకల సంజీవకుమార్‌, రామాంజనేయులు, మహబూబ్‌బాషా, మోహన్‌కృష్ణ, శ్రీరాములు, శివశంకర్‌, లింగంశెట్టి రామాంజనేయులు, సూరి, శ్రీనివాసులు, రంగారెడ్డి, షేక్షావలి, వడ్డే శివ, లోకేష్‌ పాల్గొన్నారు.


చిలమత్తూరు: ప్రభుత్వం మంజూరు చేసే ఇంటి స్థ లానికి అన్ని అర్హతలు ఉన్నా మాకు  మంజూరు చేయ లేదంటూ చిలమత్తూరు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున త హసీల్దార్‌ కార్యాలయం ఎదుట మంగళవారం ఆందోళన చేశారు.

Updated Date - 2020-07-08T10:13:53+05:30 IST