ప్రతీకాత్మక చిత్రం
ఒంటరిగా ఉన్న మహిళలపై దాడులు చేసే రోజులు పోయి.. ప్రస్తుతం జన సమూహంలోనే బెదిరించి మరీ దాడులు చేసే పరిస్థితి వచ్చింది. కొందరు తమ వద్ద ఉన్న ఆయుధాలను ప్రాణ రక్షణకు వినియోగించాల్సింది పోయి.. ఎదుటి వారి ప్రాణం, మానం తీసేందుకు వినియోగిస్తున్నారు. మధ్యప్రదేశ్లో అర్ధరాత్రి తల్లీకొడుకు కలిసి నడుచుకుంటూ వెళ్తున్నారు. అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు వారిని అడ్డుకుని, తమ వద్ద ఉన్న తుపాకీతో బెదిరించారు. అరిస్తే కొడుకును చంపేస్తామని హెచ్చరించి.. చివరికి వారు చేసిన పని స్థానికంగా సంచలనం కలిగించింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ జిల్లా పరిధికి చెందిన మహిళ.. తన మూడేళ్ల కొడుకుతో కలిసి గురువారం అర్ధరాత్రి నడుచుకుంటూ వెళ్తోంది. అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు.. అటుగా వెళ్తూ వీరిని గమనించారు. వారిని అడ్డుకుని తమ వద్ద ఉన్న తుపాకీ బయటికి తీసి బెదిరించారు. అరిస్తే చంపేస్తామని హెచ్చరించి.. ఇద్దరినీ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. కొడుకు ఎదుటే తల్లిపై అత్యాచారానికి పాల్పడ్డారు. బయట ఎవరికి చెప్పినా కొడుకును చంపేస్తామంటూ మహిళను బెదిరించి, అక్కడ నుంచి వెళ్లిపోయారు. భయం భయంగా ఇంటికి వచ్చిన ఆమె.. తన బంధువుల సహకారంతో శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు.
ఇవి కూడా చదవండి