ప్యూన్ ఉద్యోగానికి ఎగబడ్డ పోస్టుగ్రాడ్యుయేట్లు.. ఎక్కడో తెలిస్తే షాక్ అవుతారు..

ABN , First Publish Date - 2021-12-30T18:30:57+05:30 IST

మధ్యప్రదేశ్: ప్యూన్ ఉద్యోగానికి పోస్టుగ్రాడ్యుయేట్లు క్యూ కట్టారు.

ప్యూన్ ఉద్యోగానికి ఎగబడ్డ పోస్టుగ్రాడ్యుయేట్లు.. ఎక్కడో తెలిస్తే షాక్ అవుతారు..

మధ్యప్రదేశ్: ప్యూన్ ఉద్యోగానికి పోస్టుగ్రాడ్యుయేట్లు క్యూ కట్టారు. కరోనా సంక్షోభంలో అనేకమంది ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో ఉద్యోగ భద్రత ఉండే ప్రభుత్వ ఉద్యోగాలకు డిమాండ్ మరింత పెరిగింది. ప్యూన్ ఉద్యోగానికి సయితం పీజీ, పీహెచ్‌డీ చేసినవారు ధరఖాస్తు చేస్తున్నారు. గ్వాలియర్ జిల్లా కోర్టులో 15 ప్యూన్, గార్డినర్, డ్రైవర్, స్లీపర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా.. మొత్తం 11వేల మంది దరఖాస్తు చేశారు. ప్యూన్, గార్డినర్, స్లీపర్ ఉద్యోగాలకు 8వ తరగతి ఉత్తీర్ణులైనవారు అర్హులు. డ్రైవర్ ఉద్యోగాలకు టెన్త్ పాసవ్వాలి. అయితే ఇంటర్వ్యూ క్యూలో గ్రాడ్యుయేట్లు, పోస్టుగ్రాడ్యుయేట్లు ఎక్కువమంది ఉన్నారు. బీటెక్, ఎంబీఏ, పీహెచ్‌డీ చేసినవారు కూడా దరఖాస్తుదారుల్లో ఉన్నారు.

Updated Date - 2021-12-30T18:30:57+05:30 IST