జిమ్ యజమాని మహిళ వేషంలో పార్కింగ్ లాట్‌కు వచ్చి ఏం చేశాడంటే...shocking

ABN , First Publish Date - 2021-10-25T16:17:43+05:30 IST

తన సొంత జిమ్‌లోని పార్కింగ్ స్థలం నుంచి మహిళ వేషంలో వచ్చి బైక్‌లను దొంగిలించిన జిమ్ యజమానిని ఇండోర్ పోలీసులు అరెస్టు చేశారు...

జిమ్ యజమాని మహిళ వేషంలో పార్కింగ్ లాట్‌కు వచ్చి ఏం చేశాడంటే...shocking

ఇండోర్ (మధ్యప్రదేశ్): తన సొంత జిమ్‌లోని పార్కింగ్ స్థలం నుంచి మహిళ వేషంలో వచ్చి బైక్‌లను దొంగిలించిన జిమ్ యజమానిని ఇండోర్ పోలీసులు అరెస్టు చేశారు. మిస్టర్ ఇండోర్ అనే బిరుదు పొందిన అభిషేక్ పవార్ జిమ్ నడుపుతున్నాడు. నిందితుడు పవార్ జిమ్ సరిగ్గా నడవక ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నాడు. జిమ్ యజమాని అయిన అభిషేక్ పవార్ మహిళా వేషం ధరించి తన జిమ్ పార్కింగ్ స్థలంలో పార్కింగ్ చేసిన ద్విచక్రవాహనాలను చోరీ చేశాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వాహనాల దొంగ అయిన పవార్ ను అరెస్టు చేశామని జూని పోలీస్ స్టేషన్ సబ్-ఇన్‌స్పెక్టర్ ప్రదీప్ యాదవ్ తెలిపారు. 


తమ నుంచి తప్పించుకోవడానికి పవార్ మహిళా వేషం ధరించి చోరీలు చేసేవాడని ఎస్ఐ చెప్పారు. చోరీ చేసిన బైక్ లను చందన్ యాదవ్ అనే వ్యక్తికి విక్రయించాడు. ఇప్పటివరకు ఐదు బైక్ లను పవార్ మహిళా వేషంలో వచ్చి చోరీ చేశాడని తమ దర్యాప్తులో తేలిందని ఎస్ఐ చెప్పారు. వాహనాల దొంగ అయిన జిమ్ యజమాని పవార్ ను అరెస్టు చేసి, ఐదు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వివరించారు.చోరీ చేసిన బైక్ ను కొన్న చందన్ యాదవ్ ను కూడా అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు.


Updated Date - 2021-10-25T16:17:43+05:30 IST