ఆ చిన్నారి విషయంలో ప్రధాని ఏ నిర్ణయం తీసుకుంటారో..!

ABN , First Publish Date - 2021-10-05T00:30:05+05:30 IST

ప్రధాని ఆ బాలికను కలుస్తారా కలవరా.. ప్రస్తుతం మధ్యప్రదేశ్ ఇదే చర్చ. అసలేం జరిగిందంటే.. తాజాగా ఓ దివ్యాంగ బాలిక.. ప్రధాని మోదీ తమను కలిసేందుకు వస్తున్నారని భావించి సంబర పడింది. ప్రధానిని కలిసేందుకు ఆసక్తి చూపింది. అయితే ఆమె ఆశలు అడియాసల

ఆ చిన్నారి విషయంలో ప్రధాని ఏ నిర్ణయం తీసుకుంటారో..!

ఇంటర్నెట్ డెస్క్: ప్రధాని ఆ బాలికను కలుస్తారా కలవరా.. ప్రస్తుతం మధ్యప్రదేశ్ ఇదే చర్చ. అసలేం జరిగిందంటే.. తాజాగా ఓ దివ్యాంగ బాలిక.. ప్రధాని మోదీ తమను కలిసేందుకు వస్తున్నారని భావించి సంబర పడింది. ప్రధానిని కలిసేందుకు ఆసక్తి చూపింది. అయితే ఆమె ఆశలు అడియాసలయ్యాయి. ప్రధాని రావడం లేదంటూ తన తల్లి చెప్పడంతోనే ఆ చిన్నారి కాస్త బాధపడింది. కానీ.. కేంద్ర మంత్రి అభయంతో ఆ చిన్నారి ప్రధానిని కలిసే అవకాశాలు మాత్రం ఇంకా సజీవంగానే ఉన్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..  


దివ్యాంగుల కోసం మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఎహ్సాస్ ‘Ehsaas’ అనే పాఠశాల ఉంది. ఈ పాఠశాలను కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్.. సందర్శించారు. ఆయన పర్యటన సందర్భంగా ఆదివారం అయినప్పటికీ.. తల్లిదండ్రులతో విద్యార్థులు పాఠశాలకు రావాల్సిందిగా ఉపాధ్యాయులు సూచించారు. ఈ క్రమంలో ‘అనన్య అనే చిన్నారి.. ఆదివారం రోజు కూడా స్కూల్‌కు ఎందుకమ్మా’ అని తల్లిని ప్రశ్నించింది. దీంతో ఆ చిన్నారికి తన తల్లి కేంద్ర మంత్రి పర్యటన గురించి తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఆ చిన్నారి.. ‘ప్రధాని మోదీ కూడా స్కూల్‌కు వస్తున్నారా అమ్మా’ అని తల్లిని ఎదురు ప్రశ్నించింది.



తర్వాత ప్రధాని మోదీ తన స్కూల్‌కు రావడం లేదని తెలుసుకుని.. కాస్త నొచ్చుకుంది. కాగా.. కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్.. పాఠశాలను సందర్శిస్తున్న సమయంలో అనన్య తల్లి గీత.. తన కూతురి ఆసక్తిని ఆయనకు తెలియజేశారు. దీంతో చిన్నారి మనసును ఆర్థం చేసుకున్న ఆయన.. అనన్యతో సెల్ఫీ దిగారు. అంతేకాకుండా ’ఈ సెల్ఫీ ఫొటోను ప్రధానికి చూపుతానని.. మీ కోసం అక్కడ ఓ పాప ఎదురుచూస్తోందని’ చెబుతానని హామీ ఇచ్చారు. దీంతో ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశం అయింది. కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్.. నిజంగానే ఆనన్య గురించి ప్రధానికి చెబుతారా? చెబితే ప్రధాని ఆ చిన్నారి విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఆనేది ఆసక్తిగా మారింది. 


Updated Date - 2021-10-05T00:30:05+05:30 IST